Poco M6 5G | 22న భారత్ మార్కెట్లోకి పోకో ఎం6 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Poco M6 5G | షియోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ పోకో తన పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఈ నెల 22న ఆవిష్కరిస్తామని ప్రకటించింది.
Poco M6 5G | షియోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ పోకో తన పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరాతో వస్తున్నది. ఫ్రంట్‌లో వాటర్ డ్రాప్-స్టైల్ డిస్ ప్లే ఉంటుంది. ఈ నెల 22 మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ ఆవిష్కరిస్తామని పోకో తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ రెండు కలర్స్- బ్లాక్, సిల్వర్ ఆప్షన్లలో లభిస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన పోకో ఎం5 ఫోన్ కొనసాగింపుగా పోకో ఎం6 5జీ ఫోన్ రానున్నది. ఇటీవల భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన రెడ్ మీ 13సీ 5జీ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో ఎం6 5జీ ఫోన్ ఆవిష్కరిస్తున్నారని చెబుతున్నారు.
రెడ్మీ 13సీ 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ వేరియంట్ ఫోన్ రూ.9,999లకే లభిస్తున్నది. ఈ ఫోన్ 6.74 అంగుళాల డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ డెప్త్ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. 18 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

