Poco C65 | డిసెంబర్ 15న మార్కెట్లోకి పోకో సీ65..ఇవీ స్పెషిఫికేషన్స్..
Poco C65 | ఈ నెల 15న భారత్ మార్కెట్లో పొకో సీ65 ఫోన్ ఆవిష్కరిస్తామని పొకో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. స్మార్ట్ ఫోన్ ప్రేమికులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపింది.
Poco C65 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో (Poco) తన పొకో సీ65 ఫోన్ ఈ నెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్ సెట్, 18వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తున్న ఫోన్ 6.74-అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
ఈ నెల 15న భారత్ మార్కెట్లో పొకో సీ65 ఫోన్ ఆవిష్కరిస్తామని పొకో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది. స్మార్ట్ ఫోన్ ప్రేమికులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చునని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో పొకో సీ65 ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.10,700 (129 డాలర్లు), 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.12,400 (149 డాలర్లు) పలుకుతుంది. పర్పుల్ షేడ్స్, బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
పొకో సీ65 ఫోన్ గ్లోబల్ మార్కెట్లో 6.74 అంగుళాల హెచ్డీ+ (1600×720 పిక్సెల్స్) డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. మీడియా టెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 వర్షన్‌పై పని చేస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకు స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
పొకో సీ65 ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/1.8 అపెర్చర్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఎఫ్/2.4 అపెర్చర్ మాక్రో లెన్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఎఫ్/2.0 అపెర్చర్ కెమెరా ఉంటాయి. 18 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. 4జీ ఓల్ట్, వై-ఫై, బ్లూ టూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

