Home Loans-Diwali Dhamaka | ఇండ్ల రుణాలపై ఆ మూడు బ్యాంకులు ‘దీపావళి ధమాకా`.. వడ్డీరేట్ల తగ్గింపు.. చార్జీలు మాఫీ.. కార్ల పైనా..!
Home Loans-Diwali Dhamaka | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా.. దీపావళి సందర్భంగా ఇండ్లు, కార్ల రుణాలపై వడ్డీరేట్లలో రాయితీ ఇస్తున్నాయి. సిబిల్ స్కోర్ ఆధారంగా మరికొంత వడ్డీ తగ్గింపు అమలు చేస్తున్నాయి.
Home Loans-Diwali Dhamaka | ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఒక కల.. కరోనా మహమ్మారి తర్వాత అందరూ పర్సనల్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. పండుగల వేళ.. ప్రత్యేకించి దీపావళి పండుగ సందర్భంగా కార్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. సొంతిల్లు కావాలనుకునే వారికి, కార్లు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వ రంగ బ్యాంకులు.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. ‘దీపావళి ధమాకా’ ఆఫర్లు అందిస్తున్నాయి.
దీపావళి సందర్భంగా తక్కువ వడ్డీరేట్లపై రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారా ఇండ్ల రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 8.4 శాతం వడ్డీ నుంచి ఇండ్ల రుణాలు ప్రారంభం అవుతాయి.

పీఎన్బీలో ఇండ్లూ కార్ల రుణాలు ఇలా..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కస్టమర్లు తీసుకునే కార్ల రుణాలపై వడ్డీ 8.75 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు పూర్తిగా మాఫీ చేస్తారు.
ఇక ఇండ్ల రుణాలపై వడ్డీ 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు విధించబోదు. అయితే ఇంటి రుణ గ్రహీతలు ఇందుకోసం పీఎన్బీ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ https://digihome.pnb.co.in/pnb/hl ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కార్ల రుణాలు తీసుకునే పీఎన్బీ ఖాతాదారులు పీఎన్బీ వన్ (PNB ONE) యాప్ ద్వారా గానీ, PNB Website: https://www.pnbindia.in/ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవాలి. అదనపు సమాచారం కోసం 1800 1800/ 1800 2021 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా గానీ, సమీప పీఎన్బీ శాఖకు వెళ్లి గానీ తెలుసుకోవచ్చు.

ఇండ్లూ కార్ల రుణాలపై ఎస్బీఐ దీపావళి ఆఫర్లు
వివిధ శ్రేణుల ఖాతాదారులు సంబురాలు జరుపుకునేందుకు ఎస్బీఐ గత సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31 వరకూ స్పెషల్ ఆఫర్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఎస్బీఐ ఖాతాదారుల సిబిల్ (క్రెడిట్) స్కోర్ ఆధారంగా వడ్డీరేట్లలో రాయితీ ఉంటుంది. సిబిల్ స్కోర్ అత్యధికంగా ఉంటే 65 బేసిక్ పాయింట్ల వడ్డీ రాయితీ లభిస్తుంది.
ఉదాహరణకు ఒక ఎస్బీఐ ఖాతాదారుడి సిబిల్ స్కోర్ 700-749 పాయింట్ల మధ్య ఉంటే టర్మ్ లోన్ పై వడ్డీ 9.35 నుంచి 8.7 శాతానికి దిగి వస్తుంది. 750-799 మధ్య సిబిల్ స్కోర్ ఉంటే 9.15 నుంచి 8.6 శాతానికి, 800 పాయింట్లకు పైగా క్రెడిట్ స్కోర్ ఉంటే 9.15 శాతానికి బదులు 8.6 శాతంపై రుణం మంజూరవుతుంది.
సిబిల్ స్కోర్ 700 పాయింట్లకు పైగా ఉంటే టేకోవర్ హోమ్ లోన్, రీసేల్, రెడీ టు మూవ్ ప్రాపర్టీ లోన్లపై అదనంగా 20 బేసిక్ పాయింట్ల వడ్డీ తగ్గింపు ఉంటుంది. శౌర్య, శౌర్య ఫ్లెక్సి విశిష్ట్, శౌర్య ఫ్లెక్సీ రుణాలపై 10 బేసిక్ పాయింట్లు వడ్డీ తగ్గుతుంది.
ఇలా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండ్ల రుణాలు, కార్ల రుణాలపై ఆఫర్లు

పండుగల సీజన్ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్ల కోసం ‘ఫీలింగ్ ఆఫ్ ఫెస్టివల్ విత్ బీవోబీ’ అనే స్పెషల్ క్యాంపెయిన్ చేపట్టింది. ఈ క్యాంపెయిన్ డిసెంబర్ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. ఈ స్పెషల్ క్యాంపెయిన్ కింద ఇండ్లు, కార్లు, విద్యా రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయరు. ఇండ్ల రుణాలు 8.4 శాతం, కార్ల రుణంపై 8.7 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

