హైదరాబాద్, మే 22: ఫార్మా సంస్థ గ్లాండ్ ఫార్మా అంచనాలకుమించి రాణించింది. మార్చి త్రైమాసికానికిగాను సంస్థ రూ.192 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. గతేడాది నమోదైన రూ.79 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది. కంపెనీ ఆదాయం రూ.785 కోట్ల నుంచి రూ.1,537 కోట్లకు చేరుకున్నది.