EPF Auto Settlement | ఆటో సెటిల్మెంట్తో నాలుగు రోజుల్లోపే పీఎఫ్ విత్ డ్రా క్లయిమ్ పరిష్కారం..
EPF Auto Settlement | ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమకు, తమ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు, పెండ్లిండ్లు, పిల్లల ఉన్నత విద్యావసరాలు, ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్ విత్ డ్రాయల్ కోసం దాఖలు చేసే క్లయిమ్స్ కు ఆటోమేటిక్ పరిష్కార విధానం తీసుకొచ్చింది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ.
EPF Auto Settlement | ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులంతా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో ఈపీఎఫ్ ఖాతాలు కలిగి ఉంటారు. ప్రతి నెలా కొంత మొత్తం వేతనం వారీ పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. ప్రతి ఉద్యోగి పదవీ విరమణ సమయంలో మాత్రమే కాక తమ కుటుంబ అవసరాలు, పిల్లల ఉన్నత విద్యా అవసరాలు, పెండ్లిండ్లు, అనారోగ్య సమస్యల నిమిత్తం అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేస్తుంటారు. ఇందులో వైద్య ఖర్చుల కోసం ఆటో క్లయిమ్ సెటిల్మెంట్ లో ఈపీఎఫ్ఓ తాజాగా కొన్ని మార్పులు చేసింది. 68జే నిబంధన కింద ఆటో క్లయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచేసింది. దీంతోపాటు 68కే నిబంధన కింద విద్య, వివాహం, 68బీవ నిబంధన కింద ఇంటి నిర్మాణం కోసం రూ.లక్ష వరకూ ఆటో సెటిల్మెంట్ పొందొచ్చు. అసలు ఆటో సెటిల్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
సాధారణ క్లయిమ్ సెటిల్మెంట్ వేగవంతానికి ఈపీఎఫ్ఓ ఆటోప్రాసెసింగ్ తెచ్చింది. మానవ ప్రమేయం లేకుండా క్లయిమ్ లను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్మెంట్. పిల్లల పెండ్లిండ్లతోపాటు ఉన్నత విద్య, ఇంటి కొనుగోలుకు కోసం ఈపీఎఫ్‌లో ఆటో సెటిల్మెంట్ తెచ్చింది.
ఈపీఎఫ్ ఖాతాదారులు తమ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం 68జే నిబంధన కింద ఈపీఎఫ్‌లో కొంత భాగం విత్ డ్రా చేసుకోవచ్చు. నెల, అంతకంటే ఎక్కువ రోజులు దవాఖానలో చికిత్స తీసుకుంటున్నా, శస్త్ర చికిత్స చేయించుకున్నా ఈ మొత్తం విత్ డ్రా చేసుకోవచ్చు. టీబీ, పక్షవాతం, క్యాన్సర్, గుండె సంబంధ వైద్య చికిత్స కోసం ఆన్ లైన్ లోనూ క్లయిమ్ దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. 68జే నిబంధన కింద నిర్దిష్ట గడువు తర్వాతే నగదు విత్ డ్రా చేసుకోవాలన్న రూల్ లేదు. ఉద్యోగి ఆరు నెలల బేసిక్ ప్లస్ డీఏ / , డిపాజిట్ చేసిన మొత్తంలో వడ్డీతోపాటు ఉద్యోగి వాటాలో ఏది తక్కువైతే అంత మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ విత్ డ్రాయల్ దరఖాస్తు కోసం డాక్టర్ సంతకం చేసిన సర్టిఫికెట్ సమర్పించాలి.
68కే నిబంధన ప్రకారం ఉద్యోగి తన లేదా తన కుటుంబ సభ్యుల పెండ్లి, పిల్లల విద్యావసరాల కోసం పీఎఫ్ లో నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్ఓలో సబ్ స్క్రైబర్గా చేరిన ఏడేండ్ల తర్వాతే విత్ డా చేసుకోవచ్చు. ఈ అవసరాల కోసం కేవలం మూడు సార్లు తన పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50శాతం తీసుకోవచ్చు. వివాహం కోసం డబ్బు విత్ డ్రా చేస్తే ఈపీఎఫ్ సభ్యుడు ఆన్ లైన్ లో డిక్లరేషన్ సమర్పించాలి. పిల్లల చదువు కోసమైతే సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలి.
68బీ నిబంధన కింద ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్లు ఇంటి స్థలం కొనుగోలు లేదా ఇల్లు నిర్మాణానికి, ఇంటి మరమ్మతు కోసం పీఎఫ్ బ్యాలెన్స్‌లో నిర్దిష్ట పరిమితి వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి విత్ డ్రా చేసుకునే మొత్తం ఆధార పడి ఉంటది. ఈ-సేవా పోర్ట్ ద్వారా ఈ విత్ డ్రా ప్రక్రియ చేపట్టొచ్చు. క్లయిమ్ ఫైల్ చేయడానికి ఫామ్ 31 ఆన్ లైన్ లో సమర్పించాలి
ఆటో సెటిల్మెంట్ లో మనుష్యుల ప్రమేయం ఉండదు. కనుక రూ.లక్ష వరకూ ఏ క్లయిమ్ అయినా వెంటనే పరిష్కారం అవుతాయి. ఐటీ వ్యవస్థతో ఆటో సెటిల్మెంట్ పని చేస్తుంది. అర్హతతోపాటు కేవైసీ, బ్యాంకు వ్యాలిడేషన్ పూర్తయితే ఐటీ టూల్స్ ఆటోమేటిక్‌గా పేమెంట్ ప్రక్రియ చేపడతాయి. దీంతో క్లయిమ్ సెటిల్మెంట్ టైం పది రోజుల నుంచి 3-4 రోజులకు తగ్గిపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

