Pre-pandemic level | 17 నెలల స్థాయికి పెట్రోల్ సేల్స్.. ఇదే ఫస్ట్‌టైం
Pre-pandemic level | దేశంలో 17 నెలల స్థాయికి పెట్రోల్ విక్రయాలు చేరుకున్నాయి. అయితే, దేశ ఆర్థిక లావాదేవీలకు కీలక ఇండికేటర్‌గా భావించే డీజిల్ ....

Pre-pandemic level | దేశంలో 17 నెలల స్థాయికి పెట్రోల్ విక్రయాలు చేరుకున్నాయి. అయితే, దేశ ఆర్థిక లావాదేవీలకు కీలక ఇండికేటర్‌గా భావించే డీజిల్ విక్రయాలు జూలైలో 11 శాతం తగ్గుముఖం పట్టాయి. కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత బిజినెస్ లావాదేవీలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి.
దేశీయ పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో 90 శాతం పట్టు కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థల వద్ద ఉన్న డేటా ప్రకారం 2019 జూలైతో పోలిస్తే గత నెలలో పెట్రోల్ వినియోగం 3.5 శాతం ఎక్కువ అని తేలింది.
డీజిల్ వినియోగం 89 శాతానికి చేరుకున్నది. గతేడాదితో పోలిస్తే పెట్రోల్ సేల్స్ 17 శాతం, డీజిల్ వినియోగం 12 శాతం పెరిగింది. జూన్ నెలతో పోలిస్తే తొమ్మిది శాతం ఎక్కువ. కానీ డీజిల్ విక్రయాలు ఒకశాతం లోపు తగ్గాయి.
దీపావళి నాటికి డీజిల్ విక్రయాలు సాధారణ స్థాయికి చేరుతాయని ఇండియన్ ఆయిల్ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య చెప్పారు.
జెట్ ఫ్యూయల్ విక్రయం జూలైలో 53 శాతం పెరిగింది. జూన్ నెలతో పోలిస్తే జూలైలో 21 శాతం ఎక్కువ. గతేడాదితో పోలిస్తే 29.5 శాతం ఎక్కువ జెట్ ఫ్యూయల్ సేల్స్ జరిగాయి.
వంట గ్యాస్ సిలిండర్ల వాడకం 2019 జూలైతో పోలిస్తే గత నెలలో 7.5 శాతం ఎక్కువయ్యాయి. ఈ ఏడాది జూన్ నెలతో పోలిస్తే 4 శాతానికి పైగా పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- petrol sales
- pre-pandemic
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

