Paytm | ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. కెనడాలో పేటీఎం సేవలను నిలిపేస్తున్నట్లు శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది. ఇండియన్ మార్కెట్లో పేటీఎం కార్యకలాపాల బలోపేతంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నది. కెనడాలో పేటీఎం యాప్ సేవలు నిలిపేసినా..భారతీయ కస్టమర్లకు ఏ ఇబ్బందులు తలెత్తబోవని వెల్లడించింది. కొ
న్ని సార్లు కఠినమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పేటీఎం తన బ్లాగ్లో పోస్ట్ చేసింది. వచ్చే మార్చి 14కల్లా కెనడాలో సేవలు పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొంది. శుక్రవారం నుంచి తమ నిర్ణయం మేరకు దశల వారీగా సేవల నిలిపివేత ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది. 2014లో కెనడాలో పేటీఎం సేవలందించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టి. 2017లో మొబైల్ యాప్ ఆవిష్కరించింది.
బిల్లుల చెల్లింపులు, ఇతర లావాదేవీలు సౌకర్యవంతంగా జరుపుకునేందుకు ఈ ఫీచర్ అభివృద్ధి చేసింది. ఇటీవల భారత స్టాక్ మార్కెట్లో ఐపీవో ద్వారా లిస్టయిన పేటీఎం.. అనూహ్యంగా నష్టపోతున్నది. సంస్థలో కీలక ఉద్యోగులు నిష్కమిస్తున్న నేపథ్యంలో కెనడాలో పేటీఎం సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.