Palm Oil Rates Rise | సన్‌ఫ్లవర్ ఆయిల్ కొరత.. పామాయిల్ ధరలు పైపైకి!
Palm Oil Rates Rise | రష్యా దండయాత్రతో ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా తగ్గింది. ఫలితంగా పామాయిల్ ధరలు పెరిగిపోయాయి.
Palm Oil Rates Rise | పామాయిల్.. సన్‌ఫ్లవర్ ఆయిల్.. వేరుశనగ నూనె.. నువ్వుల నూనె.. వంటనూనెల్లో ముఖ్యమైనవి. ప్రపంచవ్యాప్త సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తిలో బ్లాక్ సీ రీజియన్ 60 శాతం వాటాతోపాటు ఎగుమతుల్లో 76 శాతం. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలోని వ్యాపారులు సన్‌ఫ్లవర్ క్రూడాయిల్ సరఫరా చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో బ్లాక్ సీ రీజియన్ పరిధిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ స్థానే భారత్ కొనుగోలుదారులు పామాయిల్ దిగుమతి కోసం పోటీ పడుతున్నారు. ఫలితంగా పామాయిల్ ధరలు పెరుగుతాయని అటున్నారు.
ఆసియా, ఆఫ్రికా దేశాలు ప్రైస్ సెన్సిటివ్. ఇప్పటికే ఇంధనం, ఫుడ్ వ్యయం ఆకాశాన్నంటే రీతిలో పైపైకి దూసుకెళ్లుతున్నాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు చాలా మంది సోయాబీన్ ఆయిల్ వైపు మళ్లుతున్నారు. కాస్ట్, ఇన్సూరెన్స్, రవాణా (సీఐఎఫ్)తోపాటు టన్ను క్రూడ్ పామాయిల్ (సీపీవో) ధర 1925 డాలర్లు. అదే క్రూడ్ సోయాబీన్ ఆయిల్ ధర 1865 డాలర్లు పలుకుతున్నది. క్రూడ్ రాప్సీడ్ ఆయిల్ టన్నుకు సుమారు 1900 డాలర్లకు లభిస్తున్నది.
ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఓ డీలర్ మాట్లాడుతూ సన్‌ఫ్లవర్ ఆయిల్ స్థానే ఏషియన్, యూరోపియన్ రిఫైనరీలు పామాయిల్ కొనుగోళ్లు పెంచారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు దారి తీసింది. ఇదిలా ఉంటే అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వేల్లో పొడి వాతావరణం నేపథ్యంలో సోయాబీన్ ఉత్పత్తి తగ్గుతుందని భావిస్తున్నారు. సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ స్థానే పామాయిల్ ధరలు టన్నుపై 50 డాలర్లు పెరుగుతుందని కౌలాలంపూర్ కేంద్ర వ్యాపారి చెప్పారు. మలేషియా నుంచి పామాయిల్‌కు డిమాండ్ ఉందని, ఇండోనేషియా ఆంక్షలు విధించిందని ఇండియన్ రిఫైనర్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

