OpenAI CEO | నూతన ఏఐ వెంచర్‌పై ఓపెన్ఏఐ మాజీ సీఈవో ఆల్ట్మాన్ కసరత్తు
ఓపెన్ఏఐ సీఈవోగా (OpenAI CEO)వేటుకు గురైన సామ్ ఆల్ట్మాన్ నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్‌ను లాంఛ్ చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారు.
న్యూఢిల్లీ : ఓపెన్ఏఐ సీఈవోగా (OpenAI CEO)వేటుకు గురైన సామ్ ఆల్ట్మాన్ నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్‌ను లాంఛ్ చేసేందుకు కసరత్తు సాగిస్తున్నారు. ఆల్ట్‌మాన్‌పై వేటుతో ఓపెన్ఏఐ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన ఓపెన్ఏఐ మాజీ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మాన్ ఈ వెంచర్ ఏర్పాటుకు ఆల్ట్‌మాన్‌కు సహకరించవచ్చని చెబుతున్నారు. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఆల్ట్మాన్, బ్రాక్‌మాన్‌లు అందుబాటులోకి రాలేదని ఓ వార్తా సంస్ధ పేర్కొంది.
సీఈవో మార్పుతో ఓపెన్ఏఐని వీడిన సైమన్ సైడర్ సహా పలువురు పరిశోధకులు ఆల్ట్మాన్ నూతన వెంచర్లో చేరతారా అనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్డ్‌వేర్ డివైజ్‌ను నిర్మించే ప్రతిపాదనపై ఆల్ట్మాన్, యాపిల్ మాజీ డిజైన్ చీఫ్ జాన్ ఐవ్ గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.
సాఫ్ట్‌బ్యాంక్ సీఈవొ యసయోషి సొన్ కూడా ఈ చర్చల్లో పాలుపంచుకున్నట్టు వార్తలొచ్చాయి. చాట్‌జీపీటీ సృష్టికర్త, కంపెనీ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై ఓపెన్ఏఐ బోర్డు వేటు వేయడం టెక్ ప్రపంచంలో కలకలం రేగింది. ఆల్ట్‌మాన్‌ను కంపెనీ తొలగించిన వెంటనే సహ వ్యవస్ధాపకుడు బ్రాక్‌మన్ ఓపెన్ఏఐ నుంచి వైదొలిగారు.
Read More :
Luxury Cars | లగ్జరీ కార్లపై పెరుగుతున్న మోజు.. ఫెస్టివ్ సీజన్లో రికార్డ్ సేల్స్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

