హైదరాబాద్, నవంబర్ 18: హైదరాబాద్‌కు చెందిన తొలి వెండి ఆభరణాల బ్రాండ్ ఒరాఫో జ్యూవెల్స్ తాజాగా ఈ-కామర్స్ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం సంస్థ రూపొందించిన www.orafojewels.in వెబ్‌సైట్‌ను బలగం సినిమా ఫేమ్ నటి కావ్య కల్యాణ్‌రామ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ కల్యాణ్ రామ్ మాట్లాడుతూ..కస్టమర్లు కోరుకుంటున్న విధంగా డిజైన్ చేసిన వెండి ఆభరణాలకు ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగిందని, దీంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ల్లో ఫ్రాంచైజ్ పద్దతిన రిటైల్ అవుట్లెట్లను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు.
వచ్చే మూడేండ్లకాలంలో ఈ రెండు రాష్ర్టాల్లో 25 రిటైల్ అవుట్లెట్లను తెరువాలనుకుంటున్నట్టు, ఇందుకోసం పలు సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లో మూడు అవుట్లెట్లు ఉండగా, వీటిలో రెండు సొంతం కాగా, ఒకటి ఫ్రాంచైజ్ పద్దతిన ఏర్పాటు చేసింది.