Oppo Reno 10 5G | ఒప్పో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్.. ధరెంతో తెలుసా?!
Oppo Reno 10 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ప్రీమియం ఫోన్ రెనో 10 5జీ సిరీస్ ఫోన్లలో త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.30 వేల నుంచి ప్రారంభమవుతుందని సమాచారం.
Oppo Reno 10 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 10 5జీ (Oppo Reno 10 5G) సిరీస్ ఫోన్లు త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్ ధర రూ.30 వేలతో మొదలవుతుందని తెలుస్తున్నది. గత మే నెలలో చైనా మార్కెట్లో ఒప్పో రెనో 10 (Oppo Reno 10), ఒప్పో రెనో 10 ప్రో (Reno 10 Pro), ఒప్పో రెనో 10 ప్రో + (Reno 10 Pro+) ఫోన్లు ఆవిష్కరించింది. ఇవే ఫోన్లు భారత్ మార్కెట్లో ఫ్లిప్కార్ట్ ద్వారా లభిస్తాయని తెలుస్తున్నది. ఇక ఇండియాలో విడుదల చేయనున్న ఒప్పో రెనో 10 ప్రో + (Reno 10 Pro+) వేరియంట్ ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్తో వస్తుందని ఒప్పో టీజ్ చేసింది.
భారత్ మార్కెట్లో ఒప్పో రెనో 10 5జీ ఫోన్ రూ.30 వేలు, ఒప్పో రెనో 10 ప్రో ఫోన్ బేస్ వేరియంట్ రూ.40 వేలు, ఒప్పో రెనో 10 ప్రో + పోన్ రూ.50 వేల నుంచి ప్రారంభం కావచ్చునని సమాచారం.
చైనా మార్కెట్లో ఒప్పో రెనో 10 5జీ- 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.29 వేలు (2,499 చైనా యువాన్లు), ఒప్పో రెనో 10 ప్రో బేస్ 16 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.41,000 (3499 చైనా యువాన్లు), ఒప్పో రెనో 10 ప్రో + బేస్ 16జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.45 వేలకు (3899 చైనా యువాన్లు) లభిస్తుంది.
ఒప్పో రెనో 10 5జీ ఫోన్ ఈ నెల రెండో వారంలో భారత్ మార్కెట్లో ఎంటర్ కావచ్చునని తెలుస్తున్నది. ఒప్పో రెనో 10 ప్రో + ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇండియన్ మార్కెట్లోకి 64-మెగా పిక్సెల్ టెలిఫోటో పోర్ట్రైట్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సర్ విత్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్ వైడ్ యాంగిల్ కెమెరాతోపాటు సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నా్ప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ తో అందుబాటులోకి వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

