Oppo A59 5G | రూ.15 వేల లోపు ఒప్పో ఏ59 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేసన్స్..!
Oppo A59 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో ఏ59 5జీ (Oppo A59 5జీ) ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Oppo A59 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో ఏ59 5జీ (Oppo A59 5జీ) ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గతేడాది నవంబర్‌లో తెచ్చిన ఒప్పో ఏ58 5జీ ఫోన్‌కు కొనసాగింపుగా వస్తోంది ఒప్పో ఏ59 5జీ. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 720 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
ఒప్పో ఏ59 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,999లకు లభిస్తుంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 25న ఒప్పో స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ ఔట్లెట్లలో లభిస్తుంది. సిల్క్ గోల్డ్, స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తున్నది.
ఒప్పో స్టోర్స్, ఇతర రిటైల్ ఔట్లెట్లలో ఎస్బీఐ కార్డ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్, వన్ కార్డు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్, ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.1,699 నుంచి ఈఎంఐ పేమెంట్స్ ఆప్షన్లు ప్రారంభం అవుతాయి.
ఒప్పో ఏ59 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ బాక్స్ బేస్డ్ కలర్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. 90హెర్ట్జ్ డిస్ప్లే విత్ 750 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది.
ఒప్పో ఏ59 5జీ ఫోన్ డ్యుయల్ రేర్ సెన్సర్ కెమెరా సెటప్ తో వస్తున్నది. 13-మెగా పిక్సెల్ విత్ ఎఫ్2.2 అపెర్చర్, 2-మెగా పిక్సెల్ బొకెహ్ కెమెరా విత్ ఎఫ్ 2.4 అపెర్చర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/2.0 అపెర్చర్ కలిగి ఉంటది. 33 వాట్ల సూపర్ వూక్ ఫ్లాష్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 30 నిమిషాల్లో 52 శాతం చార్జింగ్ అవుతుంది. యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

