Onion Price | టమాటలే కాదు ఉల్లిగడ్డలు కూడా కొనలేరేమో.. త్వరలోనే కిలో రూ.100 దాటే ఛాన్స్!
Onion Price | టమాట సెగకు ఉల్లి ఘాటు కూడా తోడవనున్నది. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.120 నుంచి 150 పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఉల్లిగడ్డ ధరలూ కొండెక్కుతాయన్న అంచనాలు ఇప్పుడు మొదలయ్యాయి.
Onion Price | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): టమాట సెగకు ఉల్లి ఘాటు కూడా తోడవనున్నది. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.120 నుంచి 150 పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఉల్లిగడ్డ ధరలూ కొండెక్కుతాయన్న అంచనాలు ఇప్పుడు మొదలయ్యాయి. ఇప్పటికే మార్కెట్లో ఎర్ర ఉల్లిగడ్డ రూ.30-35, తెల్ల ఉల్లిగడ్డ రూ.40-60దాకా విక్రయిస్తున్నారు. అయితే మరో నెల, రెండు నెలల తర్వాత ఈ ధరలు భారీగా పెరగవచ్చని, రూ.100కుపైగా చేరుకోవచ్చని నేషనల్ కమోడిటీస్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ సీఈవో, ఎండీ సంజయ్ గుప్తా శుక్రవారం వెల్లడించారు.
ప్రస్తుతం నిల్వ చేసిన 2.5 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ నుంచి ఉల్లిపాయల్ని వాడుతున్నామన్న ఆయన.. తగ్గిన పంట దిగుబడుల ప్రభావం అక్టోబర్, నవంబర్ నెలల్లో కనిపిస్తుందని చెప్తున్నారు. కాగా, నాఫెడ్, ఎన్సీసీఎఫ్ కలిసి ఇప్పటిదాకా 2.09 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డను సేకరించినట్టు తెలుస్తోంది. సేకరణ ప్రక్రియ మరో రెండు వారాల్లో పూర్తికానుంది. దీంతో ఈసారి గతంతో పోల్చితే సేకరణ తగ్గవచ్చంటున్నారు. ఇదే జరిగితే ఉల్లి మంట ఖాయమన్న హెచ్చరికలు మార్కెట్ వర్గాల నుంచీ వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

