OnePlus Nord CE 4 | భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ మిడ్‌రేంజ్ నార్డ్ సీఈ4.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
OnePlus Nord CE 4 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ .. తన వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
OnePlus Nord CE 4 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus) తన వన్ ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గతేడాది ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్ కొనసాగింపుగా నార్డ్ సీఈ4 ఫోన్ వచ్చింది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్, 100వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999లకు లభిస్తుంది. డార్క్ క్రోమ్, సెలాడెన్ మార్బుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వన్‌ప్లస్ ఆన్లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా, ఇతర రిటైల్ స్టోర్లలో ఈ నెల నాలుగో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం అవుతుంది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్ మీద పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 93.40 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2412 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే ఉంటుంది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్నది. గేమింగ్ కోసం ఎక్స్-యాక్సిస్ లినియర్ మోటార్ ఉంటది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ600 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఈ ఫోన్ స్టోరేజీ కెపాసిటీని ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4) ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, బీడీఎస్, గాలిలియో, యూఎస్బీ టైప్ – సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, ఈ-కంపాస్, యాంబియెంట్ లైట్ సెన్సర్, గైరోస్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటాయి. హీ-రెస్ ఆడియో మద్దతుతో వన్ ప్లస్ నార్డ్ సీఈ4 ఫోన్ డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటాయి. 100 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 15 నిమిషాలు చార్జింగ్ తో రోజంతా బ్యాటరీ లైఫ్ ఉంటది. పూర్తి బ్యాటరీ రీచార్జి చేయడానికి 29 నిమిషాలు పడుతుంది. నాలుగేండ్ల పాటు బ్యాటరీ హెల్త్ ఇంజిన్ టెక్నాలజీ అందజేస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

