Oneplus Diwali Sale | దేశవ్యాప్తంగా ఫెస్టివ్ సీజన్ సందర్భంగా ఈ-కామర్స్ సంస్థలు.. స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆ జాబితాలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ వచ్చి చేరింది. తమ ఉత్పత్తులపై ‘వన్ ప్లస్ దీపావళి సేల్’ అనే పేరుతో ఆఫర్లు ప్రకటించింది. వన్ ప్లస్ యాప్ ద్వారా కొనుగోళ్లు జరిపిన వారికి అదనపు బెనిఫిట్లు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
వన్ప్లస్ 11 5జీ, వన్ ప్లస్ బడ్స్ ప్రో2, వన్ప్లస్ ప్యాడ్ టాబ్లెట్ పై ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తామని పేర్కొంది. ఇంకా వన్ ప్లస్ పాడ్ గో, వన్ ప్లస్ నార్డ్ వాచ్, వన్ ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో లపైనా ఆఫర్లు ప్రకటించవచ్చు. ఇక వన్ ప్లస్ యాప్ ద్వారా జరిపే ‘వన్ ప్లస్ దీపావళి 2023 సేల్’లో 18 నెలల ఈఎంఐ ఆప్షన్లు, సెలెక్టెడ్ మోడల్స్ కొనుగోలు చేసిన వారికి ఉచితంగా ఇతర ఉత్పత్తులు అందిస్తామని వన్ప్లస్ తన వైబ్సైట్లో ప్రకటించింది. ఈ నెల ఏడో తేదీన పూర్తి డీల్స్ ప్రకటించనున్నదని తెలుస్తోంది.
వన్ప్లస్ 11 5జీ ఫోన్ ధర రూ.49,999 (రూ.56,999 ఎక్స్ షోరూమ్ ధర).
కూపన్ సాయంతో మరో రూ.4000 డిస్కౌంట్.
బడ్స్ జడ్22 టీడబ్ల్యూఎస్ ఇర్ ఫోన్స్ ఉచితం.
వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ ఫోన్ రూ.17,499.
వన్ ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్ రూ.28,999.
వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ రూ.22,999.
వన్ ప్లస్ బడ్స్ ప్రో2 టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్లు రూ.7,999.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ రూ.2999.
వన్ ప్లస్ పాడ్ రూ.36,999.
వన్ ప్లస్ నార్డ్ వాచ్ రూ.4,999.
వన్ ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో రూ.94,999.