Ola Electric | స్కూటర్ల సేల్స్ పెంపు కోసం ఓలా ఎలక్ట్రిక్ ఆకర్షణీయ పథకం.. అదేమిటంటే..?!
Ola Electric | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఫేమ్-2 సబ్సిడీలో కోత విధించడంతో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ల విక్రయాలు పెంచుకోవడానికి సుదీర్ఘ గడువుతో కూడిన రుణ పరపతి కల్పిస్తున్నది.
Ola Electric | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోలు చేసిన వారికి ఫేమ్-2 స్కీం కింద సబ్సిడీ కేంద్రం తగ్గించడంతో వాటి ధరలు పెరిగాయి. అలా పెరిగిన ధరల ప్రభావం కొనుగోలుదారులపై పడకుండా అన్నీ ఈవీ టూ వీలర్స్ తయారీ సంస్థలు కేంద్రీకరించాయి. కొత్త మార్గాలపై ఫోకస్ చేశాయి. ఆకర్షణీయ వడ్డీరేట్లకే ఫైనాన్సింగ్ వసతి కల్పిస్తూ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఎథర్ ఎనర్జీ ఇంతకుముందు 60 నెలల రుణ పథకం అందుబాటులోకి తెచ్చింది. ఇదే బాటలో ఓలా ఎలక్ట్రిక్ ప్రయాణిస్తున్నది.
తమ ఎస్1 శ్రేణి వెహికల్స్ కోసం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ అండ్ టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థలతో ఓలా ఎలక్ట్రిక్ జత కట్టింది. తన ఖాతాదారులకు 6.99 శాతం వడ్డీపై ఐదేండ్ల రుణ పరపతి కల్పిస్తున్నది. ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చునని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఇంతకుముందు ఎలక్ట్రిక్ వెహికల్స్కు బ్యాంకులు మూడేండ్లు, ఎన్బీఎఫ్సీలు నాలుగేండ్ల గడువుపై రుణం అందించాయి.
దేశవ్యాప్తంగా తమకు అందుబాటులో ఉన్న ఓలా ఎక్స్పీరియన్స్ కేంద్రాల్లోనూ ఈ లోన్ ఫెసిలిటీ పొందవచ్చునని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. టైర్-1, టైర్-2, టైర్ 3 నగరాల వాసులు కూడా ఈవీలను సొంతం చేసుకునేందుకు ఈ ఫైనాన్సియల్ ఆప్షన్లు ఉపకరిస్తాయని ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుశ్ అగర్వాల్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

