Okaya EV disruptor | ఒకాయా నుంచి ఈవీ బైక్ డిస్రప్టర్.. రూ.1.59 లక్షలకే సొంతం చేసుకోవచ్చు..!
Okaya EV disruptor | ఈవీ తయారీ సంస్థ ‘ఒకాయా ఈవీ (Okaya EV)’ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ‘డిస్రప్టర్ (Disruptor)’ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తన లగ్జరీ సబ్ బ్రాండ్ ఫెర్రాటో సహకారంతో ఈ బైక్‌ను డెవలప్ చేసింది.
Okaya EV disruptor | ఈవీ తయారీ సంస్థ ‘ఒకాయా ఈవీ (Okaya EV)’ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ‘డిస్రప్టర్ (Disruptor)’ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. తన లగ్జరీ సబ్ బ్రాండ్ ఫెర్రాటో సహకారంతో ఈ బైక్‌ను డెవలప్ చేసింది. సింగిల్ చార్జింగ్ చేస్తే 129 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. కిలోమీటర్‌కు 25 పైసలు ఖర్చు వస్తుంది. ఈ బైక్ ధర రూ.1,59,999 (ఎక్స్ షోరూమ్) లకు లభిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈవీ సబ్సిడీలతో కలుపుకుని రూ.1.4 లక్షలకే లభిస్తుంది. ప్రీమియం డీలర్ల వద్ద ఈ-బైక్ విక్రయిస్తామని ఒకాయా తెలిపింది. 100కి పైగా షోరూములు తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. తొలి వెయ్యి మంది కస్టమర్లు అధికార ఫెర్రాటో వెబ్ సైట్లో రూ.500 బుక్ చేసుకోవచ్చు. వెయ్యి మంది దాటితే రూ.2,500 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవాలి.
తొలుత ఢిల్లీ, గుర్గావ్, చెన్నై, అహ్మదాబాద్, పుణె, బెంగళూరు నగరాల్లో ‘ఒకాయా’ తన ‘డిస్రప్టర్’ ఈవీ బైక్ విక్రయిస్తామని తెలిపింది. ప్రీ-బుకింగ్ చేసుకున్నవారికి 90 రోజుల్లోపు డెలివరీ చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ బైక్ ‘డిస్రప్టర్’.. మస్క్యులర్ ట్యాంకు, దాని దిగువన స్టోరేజీ స్పేస్, ఈ-బైక్’లో సస్పెన్షన్, ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో మోనోషాక్ యూనిట్, ఏబీఎస్ తోపాటు టూ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. టైర్ హగ్గర్, స్ప్లిట్ సీట్ సెటప్, ఇరువైపులా అట్రాక్టివ్ లుకింగ్ ఎల్ఈడీ లైట్స్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఈ బైక్ మిడ్ నైట్ షైన్, థండర్ బ్లూ, ఇన్ పెర్నో రెడ్ రంగుల్లో లభిస్తుంది.
పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ (పీఎంఎస్ఎం)తో పని చేస్తుందీ ఒకాయా డిస్రప్టర్ బైక్. ఇది గరిస్టంగా 6.37కిలోవాట్ల విద్యుత్, 228 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. గంటకు గరిష్టంగా 95 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్స్‌లో లభిస్తుంది. హ్యాండిల్ బార్ మీద స్విచ్ సాయంతో రైడింగ్ మోడ్ మార్చుకోవచ్చు.
ఒకాయా డిస్రప్టర్ ఈవీ బైక్ ఎల్ఎఫ్పీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న 3.97 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో కూడిన విద్యుత్ మోటార్ ఉంటుంది. ఐదు గంటల్లో 100 శాతం చార్జింగ్ అవుతుంది. సింగిల్ చార్జింగ్ పూర్తి చేస్తే 129 కి.మీ దూరం ప్రయాణించొచ్చు. బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీ, జియో ఫెన్సింగ్, ఫైండ్ మై వెహికల్ అడ్వాన్స్డ్ ఫీచర్లు జత చేశారు. మూడేండ్లు లేదా 30 వేల కి.మీ వరకూ వారంటీ ఆఫర్ చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

