Post Office Recuring Dipost | పోస్టాఫీసు ఆర్డీలో మదుపుతో మిలియనీర్ కావచ్చు.. ఇవీ డిటైల్స్ !
Post Office Recuring Dipost | పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)లో పెట్టుబడులు ఐదేండ్లు కొనసాగిస్తే మిలియనీర్ అవుతారు.
Post Office Recuring Dipost | పల్లెటూళ్లలో చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కేరాఫ్ అడ్రస్ పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్.. ఇప్పుడు పల్లెల నుంచి పట్టణాలు, మెట్రో పాలిటన్ నగరాల్లోనూ పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. వాటిల్లో రికరింగ్ డిపాజిట్ పథకం ఒకటి. దీనిపై వార్షిక ప్రాతిపదికన వడ్డీరేట్లు పెంచేసింది పోస్టాఫీసు. జూలై ఒకటో తేదీ నుంచి రికరింగ్ డిపాజిట్‌పై 6.2 నుంచి 6.5 శాతానికి వడ్డీ పెంచేసింది. రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) ద్వారా భారీ మొత్తంలో నిధి సమకూరుతుంది. అదెలాగో తెలుసుకుందామా.. !
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)లో మదుపుతో మీరు భారీ మొత్తంలో పొదుపు చేయొచ్చు. ‘ఆర్డీ’ని మీరు పిగ్గీ బ్యాంకుగా వాడొచ్చు. ప్రతి నెలా నిర్ధిష్ట మొత్తం మీ వేతనం నుంచి ‘ఆర్డీ’లో డిపాజిట్ చేస్తూ వచ్చారనుకుందాం.. అలా ఐదేండ్లు డిపాజిట్ చేయడం వల్ల భారీ మొత్తం మీ చేతుల్లో ఉంటుంది. ఇంట్లో ‘పిగ్గీ’ బ్యాంకు నిర్వహించినా.. వడ్డీ పొందలేరు. కానీ, పోస్టాఫీసులో నగదు డిపాజిట్ చేయడం వల్ల వడ్డీ ఆదాయం లభిస్తుంది. పదేండ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ముగ్గురు వ్యక్తులు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ)పై 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు కనీసం ప్రతి నెలా రూ.100 డిపాజిట్ చేయాలి. గరిష్ట డిపాజిట్‌కు పరిమితి లేదు. ఉదాహరణకు ప్రతి నెలా రూ.1000 డిపాజిట్ చేశారనుకుందాం.. ఐదేండ్ల తర్వాత డిపాజిట్ చేసిన మొత్తం రూ.60 వేలు. దానిపై వడ్డీ ఆదాయం రూ.10,989. ఐదేండ్లు దాటిన తర్వాత డిపాజిట్ మొత్తం ప్లస్ వడ్డీ ఆదాయం కలిపితే రూ.70,989 లభిస్తుంది.
రూ.2000 డిపాజిట్ చేస్తే ఐదేండ్లకు రూ.1.20 లక్షలు అసలు, దానిపై వడ్డీ రూ.21,983 వడ్డీ కలిపి మెచ్యూరిటీ తేదీ నాటికి రూ.1,41,983 అవుతుంది. అదే రూ.5000 చొప్పున డిపాజిట్ చేస్తే ఐదేండ్లకు రూ.3 లక్షలు.. వడ్డీ రూ.54,954 కలిపి మెచ్యూరిటీ తేదీ నాటికి 3,54,954 అవుతుంది.
వడ్డీపై ఐటీ మినహాయింపులు ఇలా
రికరింగ్ డిపాజిట్లపై రూ.40 వేల వడ్డీ ఆదాయం వరకు ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. అంతకు మించి ఆదాయం లభిస్తే 10 శాతం టీడీఎస్ పే చేయాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్ క్లయిమ్ చేయడానికి సీనియర్ సిటిజన్లు 15 హెచ్, సాధారణ పౌరులు 15 జీ ఫామ్ సొంతంగా దాఖలు చేయాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

