NPS Payment By UPI | ఎన్పీఎస్ ప్రీమియం పేమెంట్స్ ఇక చాలా ఈజీ.. ఎలాగంటే?!
NPS Payment By UPI | ఇకనుంచి నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) సబ్స్క్రైబర్లు ప్రీమియం పేమెంట్స్.. యూపీఐ హ్యాండిల్ ద్వారా చేయొచ్చు.
NPS Payment By UPI | మీరు నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లో సభ్యులుగా చేరారా.. అయితే, నెలవారీ ప్రీమియం చెల్లింపులు చేయడం మరింత సులభతరం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్ (యూపీఐ) ద్వారా.. అంటే ఫోన్ పే.. గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా చెల్లించొచ్చు. ఎన్‌పీఎస్‌లో సబ్స్క్రిప్షన్ (సభ్యులైన) పొందిన వారికి లబ్ధి చేకూర్చేందుకే ఈ వెసులుబాటు కల్పించినట్లు పెన్షన్ ఫండ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. ప్రస్తుతం ఎన్పీఎస్ సబ్స్క్రైబర్లు.. నెఫ్ట్ (NEFT), ఆర్టీజీఎస్ (RTGS), ఐఎంపీఎస్ (IMPS) వంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్దతుల్లో తమ ప్రీమియం చెల్లిస్తున్నారు. యూపీఐ హ్యాండిల్ ద్వారా ఎన్పీఎస్ సబ్స్క్రైబర్ల పేమెంట్స్ తేలిగ్గా.. ఫ్లెక్సిబుల్‌గా, త్వరగా పూర్తవుతాయి. యూపీఐ ద్వారా పేమెంట్స్ ఒక్కరోజులోనే పూర్తి చేయొచ్చు.
యూపీఐ హ్యాండిల్ పేమెంట్స్ కోసం డీ-రెమిట్ వర్చువల్ అకౌంట్ `పీఎఫ్ఆర్డీఏ.15 డిజిట్ వర్చువల్ అకౌంట్ @ యాక్సిస్ బ్యాంక్ (PFRDA.15digitVirtualAccount@axisbank)` ఖాతా తెరిచారు. పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) తో డీ-రెమిట్ వర్చువల్ ఖాతా నంబర్ విభిన్నంగా ఉంటుంది.
అయితే, యూపీఐ హ్యాండిల్ డీ-రెమిట్ ఖాతా ద్వారా ప్రీమియం (సభ్యుడి కంట్రిబ్యూషన్) పేమెంట్స్ రూ.500, అంతకంటే ఎక్కువగా ఉండాలి. సంబంధిత సభ్యుడి ఖాతాదారు నుంచి ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల్లోపు ప్రీమియం చెల్లింపులు జరిపితే.. ఆ రోజే పేమెంట్స్ జరిగినట్లు పరిగణిస్తారు. 9.30 గంటల తర్వాత పేమెంట్స్ చేస్తే మరుసటిరోజు చెల్లించినట్లు గణిస్తారు. ప్రీమియం గడువును బట్టి యూపీఐ హ్యాండిల్‌పై ఆటో డెబిట్ ఫెసిలిటీ కూడా ఉపయోగించుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

