1400 కోట్ల జీఎస్టీ ఎగవేతపై నోటీసులు
రూ.1,400 కోట్ల జీఎస్టీ ఎగవేతపై కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాజీ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ దూకుడు పెంచింది. ఈ జీఎస్టీ ఎగవేతపై శుక్రవారం 17 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రూ.1,400 కోట్ల జీఎస్టీ ఎగవేతపై కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాజీ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ దూకుడు పెంచింది. ఈ జీఎస్టీ ఎగవేతపై శుక్రవారం 17 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ జీఎస్టీ కుంభకోణంలో మొత్తం 75 కంపెనీలపై పోలీసులు అభియోగాలు నమోదు చేయగా, వీటిలో పన్నులు ఎగవేసిన 17 సంస్థలకు తాజాగా నోటీసులు జారీ చేశారు.
ఇందులో ఏడుకొండలు లేబర్ కాంట్రాక్టర్ కో-ఆపరేటివ్ సొసైటీ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సంస్థ వాణిజ్య శాఖకు రూ.7.66 లక్షలు ఎగవేసినట్లు నోటీసులో పేర్కొన్నది. జూలై 1, 2017లో ఏడుకొండలు రిజిస్టర్ అవగా, మార్చి 20, 2023న తన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నది. ఈ మధ్యకాలంలో జీఎస్టీ రిటర్ను దాఖలు చేయడంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈ స్కామ్‌పై దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

