Nokia G42 5G | మార్కెట్లోకి నోకియా బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్.. ఏఐ బేస్డ్ ట్రిపుల్ కెమెరా.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Nokia G42 5G | ఫిన్లాండ్ టెక్ కంపెనీ నోకియా.. దేశీయ మార్కెట్లోకి ఏఐ బేస్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్గల బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ నోకియా జీ42 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఈ నెల 15 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
Nokia G42 5G | ఫిన్లాండ్ టెక్ కంపెనీ నోకియా.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ ‘నోకియా జీ42 5జీ (‘Nokia G42 5G)’ ఆవిష్కరించింది. 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ ఏఐ కెమెరా సెటప్‌తో వస్తున్నది. దీని ధర రూ.12,599. ఈ ఫోన్ బ్యాటరీ రీప్లేస్ మెంట్ ఆప్షన్ కూడా కల్పిస్తున్నది. సింగిల్ చార్జింగ్‌తో మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని నోకియా తెలిపింది.
నొకియా జీ42 5జీ ఫోన్ (Nokia G42 5G).. 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్నది. ఈ ఫోన్ మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఇంటర్నల్ స్టోరేజీ ఒక టిగా బైట్ (1024 జీబీ) వరకు పొడిగించుకోవచ్చు. ఈ నెల 15 నుంచి కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. నోకియా జీ42 5జీ ఫోన్ 6.56 – అంగుళాల డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది.
నోకియా జీ42 5జీ ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరాతోపాటు సెల్ఫీలూ, వీడియోకాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ఒక్టాకోర్ ప్రాసెసర్ చిప్సెట్ గల ఈ ఫోన్ 2.2 గిగా హెర్ట్జ్ స్పీడ్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ -13 వర్షన్‌పై ఫోన్ పని చేస్తుంది. 20 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. 2జీ, 3జీ, 4జీ, 5జీ, వై-ఫై, బ్లూ టూత్ 5.1, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

