Paytm- ED | పేటీఎంకు ఈడీ క్లీన్ చిట్.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టీకరణ
Paytm- ED | విదేశీ మారక ద్రవ్యం యాజమాన్యం చట్టం (ఫెమా) నిబంధనలను పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్) ఉల్లంఘించినట్లు తేలలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Paytm- ED | విదేశీ మారక ద్రవ్యం యాజమాన్యం చట్టం (ఫెమా) నిబంధనలను పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్) ఉల్లంఘించినట్లు తేలలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెగ్యులేటరీ నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ ఈ నెల 29 తర్వాత ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేకరణ, రుణ పరపతితోపాటు ఇతర సేవలు అందించవద్దని పేటీఎం ను ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), విదేశీ మారక ద్రవ్య యాజమాన్యం చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించిన పేటీఎంలో లావాదేవీలు జరిగాయా? అన్న కోణంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. 50 లక్షలకు పైగా పేటీఎం ఖాతాలు, వాలెట్లను ఈడీ అధికారులు తనిఖీ చేశారు.
కేవైసీతోపాటు ఇతర రెగ్యులేటరీ నిబంధనలు మాత్రమే ఉల్లంఘించినట్లు తేలింది.పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఈడీ అధికారులు తమ దర్యాప్తు నివేదికను ఆర్బీఐకి సమర్పించనున్నట్లు సమాచారం. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు, పేమెంట్ అగ్రిగేటర్స్ తదితర అంశాలపై ఆర్బీఐ మాత్రమే చర్యలు తీసుకోగలదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

