హైదరాబాద్, నవంబర్ 1: ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ మరో రికార్డును సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 19.71 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసిం ది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఉత్పత్తిచేసిన దాంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం.
అలాగే అమ్మకాలు 23.40 శాతం పెరిగి 23.99 మిలియన్ టన్నులకు చేరింది. గత నెల విషయానికి వస్తే 3.92 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 3.44 మిలియ న్ టన్నుల ఖనిజాన్ని విక్రయించింది.