న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: నిస్సాన్‌కు చెందిన మ్యాగ్నైట్ మాడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2020 నుంచి డిసెంబర్ 2023లోపు తయారైన మ్యాగ్నైట్ మాడళ్లలో ముందు డోరు హ్యాండిల్ సెన్సార్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీటిని వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది. ఎన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కానీ, గతేడాది డిసెంబర్ తర్వాత తయారైన మాడళ్లలో ఎలాంటి సమస్యలు రాలేవని స్పష్టంచేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని కారు కొనుగోలు చేసిన వారికి సమాచారం ఇచ్చినట్లు, ఉచితంగా వీటికి మరమ్మతులు చేసి ఇవ్వనున్నట్లు తెలిపింది.