Reliance | గతవారం ట్రేడింగ్లో టాప్-10 స్క్రిప్ట్ల్లో హిందూస్థాన్ యూనీ లివర్ మినహా తొమ్మిది సంస్థలు రూ.90,318.74 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ది పొందింది. గత వారం స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 652.7 పాయింట్లు (1.10 శాతం) లాభంతో ముగిసింది. దీపావళి నాడు సోమవారం మార్కెట్లలో హిందూ సంవత్ సంవత్సరం 2079 ప్రారంభం సందర్భంగా గంట సేపు ట్రేడింగ్ జరిగింది. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు.
రిలయన్స్తోపాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ లాభపడ్డాయి. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.36,566.82 కోట్లు పెరిగి రూ.17,08,932.42 కోట్లకు చేరుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.11,195.61 కోట్లు ఎక్కువై రూ.8,12,378.52 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,792.67 కోట్లు వృద్ధి చెంది రూ.4,54,404.76 కోట్ల వద్ద ముగిసింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ. 8,879.98 కోట్లు పెరిగి రూ. 5,09,372.21 కోట్ల వద్ద స్థిర పడింది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,617.06 కోట్లు పెంచుకుని రూ.11,57,339.65 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.8,214.27 కోట్లు పెరిగి రూ.4,36,240.27 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ రూ. 5,259.92 కోట్లు పెంచుకోవడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,36,476.13 కోట్ల వద్ద నిలిచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.568.37 కోట్లు ఎక్కువై రూ.6,32,832.76 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ. 224.04 కోట్లు వృద్ధి చెంది రూ.4,28,677.66 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ. 30,509.44 కోట్లు పతనమై రూ.5,93,318.79 కోట్లకు చేరింది. టాప్-10 స్క్రిప్ట్ల్లో రిలయన్స్ లీడ్లో కొనసాగుతుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఎస్బీఐ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ నిలిచాయి.