New Ola S1 Bookings | 2వారాల్లోనే ఓలా ఎస్1 న్యూ స్కూటర్స్ బుకింగ్స్ రికార్డు.. ఇవీ డిటైల్స్!
New Ola S1 Bookings | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన ఎస్1 సిరీస్ స్కూటర్ల బుకింగ్స్ లో రికార్డు నమోదైంది.
New Ola S1 Bookings | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ జోరుమీదుంది. తాజాగా మార్కెట్లోకి తెచ్చిన ఓలా ఎస్1 సిరీస్ స్కూటర్ల బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రారంభించిన రెండు వారాల్లోనే 75 వేలకు పైగా స్కూటర్లకు బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూ ఎస్1 (News S1) సిరీస్ స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. వీటి ధరలు రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల మధ్య పలుకుతున్నాయి.
ఇప్పటికే మార్కెట్లో ఆవిష్కరించిన ఎస్1 ఎయిర్ (Ola S1 Air)తోపాటు ఓలా ఎస్1 ప్రో జెన్2 (Ola S1 Pro Gen 2), ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X) స్కూటర్లను తాజాగా ఆవిష్కరించింది. ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ రూ.1,19,999 పలుకుతుండగా, ఫ్యూయల్ వినియోగంలో కొనుగోలు దారులు ఏటా రూ.23 వేలు (నెలకు రూ.1900), ఎస్ 1 ప్రో రూ.1,47,499లకు లభిస్తుండగా, నెలకు రూ.1100 చొప్పున ఏటా రూ.13 వేలు ఆదా చేయొచ్చు. ఇక ఎస్1 ఎక్స్ (S1 X) స్కూటర్ ధర రూ.89,999-రూ.99,099 కాగా, నెలవారీగా రూ.2,600 చొప్పున ఏటా రూ.30 వేల వరకు పొదుపు చేయొచ్చు.
ఈ నెల 15న ఓలా ఎలక్ట్రిక్ మూడు వేరియంట్లలో ఎస్1ఎక్స్ – ఎస్1ఎక్స్+, ఎస్1ఎక్స్ (2 కిలోవాట్స్), ఎస్1ఎక్స్ (3 కిలోవాట్స్) ఆవిష్కరించింది. వీటితోపాటు సెకండ్ జనరేషన్ స్కూటర్ ఎస్1 ప్రో జెన్ 2 స్కూటర్ కూడా ఆవిష్కరించింది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 120 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

