Kia Karens Luxury (O) | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్.. భారత్ మార్కెట్లోకి కరెన్స్ న్యూ వేరియంట్ కారు లగ్జరీ (ఓ)ను తీసుకొచ్చింది. లగ్జరీ, లగ్జరీ ప్లస్ వేరియంట్ల మధ్యలో లగ్జరీ (ఓ) వేరియంట్ కారు నిలుస్తుందని భావిస్తున్నారు. కరెన్స్ లగ్జరీ (ఓ) కారు టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. సెవెన్ సీట్ లే ఔట్లో మిడిల్ రో బెంచ్టైప్ సీట్ సెట్టింగ్ ఉంటుంది.
కియా కరెన్స్ లగ్జరీ (ఓ) కారు ధర రూ.17 లక్షల నుంచి ప్రారంభం కానున్నది. టాప్ ఎండ్ లగ్జరీ ప్లస్ టర్బో పెట్రోల్ వేరియంట్ కారు ధర కంటే రూ.1.45 లక్షలు చౌకగా, న్యూ డీజిల్ వేరియంట్ కారు ధర దాదాపు రూ.1.10 లక్షలు ఎక్కువ అవుతుందని భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ పవర్ ట్రైన్ కార్లలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది.
కియా కరెన్స్ లగ్జరీ (ఓ) కారు పెట్రోల్ వేరియంట్లో 1.5 లీటర్ల టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఇంజిన్ గరిష్టంగా 253 ఎన్ఎం టార్చి, 158 బీహెచ్పీ పవర్ కలిగి ఉంటుంది. 7-స్పీడ్ డీసీటీ యూనిట్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇక డీజిల్ వేరియంట్ ఇంజిన్ 6-స్పీడ్ ఏటీ టార్చి కన్వర్టర్, 115 బీహెచ్పీ పవర్, 250 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
వైర్లెస్ చార్జర్, పడెల్ షిప్టర్స్, 8-స్పీకర్ బోస్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. లగ్జరీ (ఓ) ట్రిమ్ వేరియంట్లో ఎలక్ట్రిక్ సన్రూఫ్, మల్టీ డ్రైవ్ మోడల్స్, ఎల్ఈడీ క్యాబిన్ లైట్స్, 10.25-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, 12.5-అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, క్రూయిజ్ కంట్రోల్, రేర్ వ్యూ కెమెరా, ఎయిర్ ఫ్యూరిఫయర్, సీట్ బ్యాక్ టేబుల్ రో, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, ఫోర్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 64-కలర్ ఆంబియెంట్ లైటింగ్, ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ విత్ డీఆర్ఎల్స్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు.
ప్రయాణికుల సేఫ్టీ కోసం ఏబీఎస్, ఈఎస్సీ, 6-ఎయిర్బ్యాగ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫోర్ వీల్ డిస్క్ బ్రేక్స్, రేర్ పార్కింగ్ సెన్సర్లు, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్ ఫర ఆల్ సీట్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.