IT Returns | కొత్త పాలసీ డిఫాల్ట్ అయినా.. పాత ఐటీ విధానమే బెటర్!
IT Returns | కొత్త ఐటీ విధానం ఆకర్షణీయంగా కనిపిస్తున్నా.. భవిష్యత్ కుటుంబ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే పాత ఐటీ విధానంలో ఐటీఆర్ ఫైల్ చేయడం బెటర్ అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
IT Returns | ప్రతి వేతన జీవి.. కార్పొరేట్ సంస్థలు.. చిన్న వ్యాపారులు.. ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని బట్టి ఇన్‌కం టాక్స్ పే చేయాల్సిందే. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) మొదలైంది. 2022-23 ఆర్థిక సంవత్సర ఆదాయం ఆధారంగా జూలై నెలాఖరు లోగా ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇప్పుడు ఆదాయం పన్ను విధానాల్లో పాత, కొత్త పాలసీలు ఉన్నాయి. గతేడాది కూడా ఈ రెండు పాలసీలు ఉన్నా, పెద్ద తేడా కనిపించేది కాదు. కానీ, ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తపన్నుల విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అంతే కాదు కొత్త ఆదాయం పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా ఉంటుందని తేల్చేశారు.
ఉద్యోగి చెబితే తప్ప.. కొత్త పాలసీ కింద ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సిందే
కనుక ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారు ప్రత్యేకంగా తమ ఆలోచన ప్రకారం పాత పన్ను విధానం కింద ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలనుకుంటేనే ఐటీఆర్ పూర్తి చేయొచ్చు. అలా కానీ పక్షంలో కొత్త పన్ను పాలసీ కిందే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ సంస్థలకు కూడా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు స్పష్టంగా చెప్పకపోతే కొత్త పన్ను పాలసీనే పరిగణనలోకి తీసుకోవాలని తేల్చేసింది. ఈ పరిస్థితుల్లో ఏ పాలసీ వల్ల ఎవరికెలా బెనిఫిట్ అన్న విషయమై ఓ లుక్కేద్దాం..
గతేడాది వరకు కొత్త పాలసీ కింద ఐటీ రిటర్న్స్ తక్కువే
2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పించక ముందు కొత్త ఆదాయం పన్ను పాలసీలో ఐటీ రిటర్న్స్ సమర్పించిన వారు చాలా తక్కువే. కానీ ఈ ఏడాది శ్లాబ్‌లు సవరించడంతో కాసింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. కాకపోతే పాత పన్ను పాలసీలో దాదాపు 70 వరకు డిడక్షన్ ఆప్షన్లు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ తమ పర్సనల్ ఇన్‌కం ఆధారంగా లెక్కలేసుకుని ఏ పాలసీ తమకు బెటరో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కొత్త పాలసీ కింద రూ.7.5 లక్షల వరకు నో ట్యాక్స్.. అయితే..
మీ ఆదాయం రూ.7 లక్షల్లోపు కంటే తక్కువగా ఉంటే కొత్త ఆదాయం పన్ను విధానంలో ఐటీఆర్ సబ్మిట్ చేయొచ్చు. దీనికి తోడు రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉంటది. అంటే రూ.7.5 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.7.5 లక్షల కంటే కొంచెం ఎక్కువ ఆదాయం ఉన్నా మీరు పే చేయాల్సిన ఇన్‌కం టాక్స్ రూ.31,200 చెల్లించాల్సి ఉంటది.
పాత విధానం కింద రూ.5 లక్షలు దాటితే పత్రాలు సబ్మిట్ చేయాలి
అలా కాకుండా పాత పన్ను పాలసీ కింద ఐటీఆర్ సబ్మిట్ చేయాలనుకుంటే మాత్రం రూ.2.5 లక్షల వరకు ఐటీ మినహాయింపులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోళ్లు తదితర స్కీమ్‌ల కింద ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయొచ్చు. ఇంటి అద్దె, పిల్లల ఉన్నత విద్యా కోర్సులకు రుణంపై వడ్డీ చెల్లింపు 80సీసీడీ (1బీ) సెక్షన్ మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలు డిడక్షన్ కోరవచ్చు. ఆరోగ్య బీమా పాలసీలకు సెక్షన్ 80డీ కింద కూడా పన్ను ఆదా చేయవచ్చు. తల్లిదండ్రులకు గిఫ్ట్‌లు, ఇంటి అద్దెచెల్లింపుల కింద కూడా డిడక్షన క్లయిమ్ చేయొచ్చు.
ఇంటి రుణంపై రూ.3.5 లక్షల వరకు పన్ను ఆదా చేయొచ్చు
ఇంటి రుణంపై వడ్డీకి సెక్షన్ 24బీ, 80ఈఈఏ కింద రూ.3.5 లక్షల వరకు డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపునకు సెక్షన్ 24బీ కింద రూ.2 లక్షలు, అసలు మొత్తం పేమెంట్స్‌కు 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు వస్తుంది. అందరికీ ఒకే సూత్రం వర్తించకపోవచ్చు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ ఖర్చులు, భవిష్యత్ అవసరాలు, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడుతుంటారు గనుక పాత పన్ను విధానమే ప్రతి ఒక్కరికి బెస్ట్. పన్ను ఆదా చేయడంతోపాటు భవిష్యత్ కుటుంబ అవసరాలు, లక్ష్యాలకు పొదుపు పథకాలు, బీమా పాలసీలు ఉపయుక్తంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌లో ఇచ్చిన క్యాలిక్యులేటర్ ఉపయోగించుకుంటే ఏది బెటర్ అన్న సంగతి తేలిగ్గా తెలుసుకోవచ్చు.
MORE READ :
IT Returns | మీకు రూ.10 లక్షల వేతనం వస్తుందా.. ఇవీ పన్ను బెనిఫిట్ మార్గాలు?!
IT Returns | పేరెంట్స్‌కు గిఫ్ట్స్ ఇచ్చినా పన్ను డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు.. ఇలా !
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

