మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో ఇలా..
చాలామంది వివిధ మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ తమ ఆర్థిక లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలను తీర్చిదిద్దుకోరు.
చాలామంది వివిధ మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ తమ ఆర్థిక లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలను తీర్చిదిద్దుకోరు. ఈ రకమైన అవగాహన లోపం వల్ల మార్కెట్ ఒడిదుడుకులకు లోనై నష్టాలపాలయ్యే పరిస్థితులే ఎక్కువ. వివేకంతో తీసుకునే నిర్ణయాలే మంచి రాబడులను ఇస్తాయన్న విషయం మదుపరులు మరువద్దు.
10 శాతం దాటరాదు
మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలను ప్రధానంగా లక్ష్యాలు, రిస్కుల ఆధారంగా ఎంచుకోవడం ఉత్తమం. కాబట్టి మీకున్న అవసరాలు, మార్కెట్ తీరుతెన్నులను గమనించి ముందుకెళ్లండి. అలాగే ఆయా పథకాల మధ్య పెట్టుబడుల్లో భారీ అంతరాలు ఉండరాదు. అందుకే ఏ పథకంలోనైనా మన మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10 శాతాన్ని మించి పెట్టుబడులు పెట్టకపోవడమే శ్రేయస్కరం. విశ్వసనీయమైన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలైనా, ఆకట్టుకునే ఫండ్ మేనేజైర్లెనా ఎందులోనూ, ఎవరికైనా పూర్తిగా పెట్టుబడులను అప్పగించరాదు. అలాగే అత్యవసరాలకు నగదు అందుబాటులో ఉండేలా నిర్ణయాలుండాలి. ప్రతీ 6 నెలలకోసారి పోర్ట్‌ఫోలియో సమీక్ష తప్పనిసరి.
నిపుణుల సలహా అవసరం
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. నేరుగా స్టాక్స్, డెరివేటివ్ల్లో పెట్టుబడుల కంటే భద్రమే అయినా.. దేశ, విదేశీ పరిణామాలకు ప్రభావితమవుతూనే ఉంటాయి. కాబట్టి పెట్టుబడి సాధనాలను ఎంచుకునే ముందు ఒక్కసారి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఎంతైనా మంచిది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

