మీ పిల్లలకు మ్యూచువల్ ఫండ్స్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ కొత్త నిబంధనలను తెలుసుకోవాల్సిందే. నిజానికి పిల్లల దీర్ఘకాల సంపద నిర్మాణానికి మ్యూచువల్ ఫండ్స్ బహుమతి అనేది ఎప్పట్నుంచో ఉన్న చక్కని మార్గం. కానీ ఇటీవల వచ్చిన రూల్స్.. ఈ ప్రక్రియను చాలా సంక్లిష్టం చేశాయి. కాబట్టి డీమ్యాట్ అవసరాల నుంచి పన్ను సమస్యల వరకున్న నూతన విధివిధానాలను తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి. అప్పుడే పొరపాట్లను అధిగమించి అనుకున్నది సజావుగా సాగగలదు.