Layoffs | లేఆఫ్స్ ప్రకటించిన స్పాటిఫై : 17 శాతం ఉద్యోగులపై మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం వేటు
ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం స్పాటిఫై ఉద్యోగుల సంఖ్యను 17 శాతం కుదించనున్నట్టు వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా స్పాటిఫై లేఆఫ్స్‌కు (Layoffs) తెగబడింది.
న్యూఢిల్లీ : ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం స్పాటిఫై ఉద్యోగుల సంఖ్యను 17 శాతం కుదించనున్నట్టు వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా స్పాటిఫై లేఆఫ్స్‌కు (Layoffs) తెగబడింది. కంపెనీ చేపట్టిన మార్పులను స్పాటిఫై సీఈవో డేనియల్ ఏక్ బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించారు. కంపెనీ మెరుగ్గా పనిచేసినా ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ గొప్పగా లేదని వివరించారు.
వ్యాపారాన్ని పెంచుకునేందుకు అవసరమైన నిధుల సమీకరణ వంటి అంశాలు వ్యయభరితంగా మారాయని చెప్పుకొచ్చారు. దీంతో స్పాటిఫై తాను ఖర్చు చేసే తీరు, పనులు చక్కబెట్టేందుకు అవసరమయ్యే ఉద్యోగుల సంఖ్యను పునఃసమీక్షించుకున్నదని బ్లాగ్ పోస్ట్‌లో డేనియల్ ఏక్ రాసుకొచ్చారు.
తమ భవిష్యత్ లక్ష్యాలకు అనుగుణంగా రాబోయే సవాళ్లను ఎదుర్కొనేలా తమ ఉద్యోగుల సంఖ్యను 17 శాతం తగ్గించాలనే సంక్లిష్ట నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కంపెనీకి గొప్ప సేవలు అందించిన చురుకైన, నైపుణ్యం కలిగిన కష్టపడి పనిచేసే వ్యక్తులను వదులుకోవాలనే బాధాకర నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇక ఈ ఏడాది జూన్‌లోనూ స్పాటిఫై తన పాడ్‌కాస్ట్ యూనిట్లో 200 మంది ఉద్యోగులను తొలగించింది.
Read More :
IT Minister | తెలంగాణ బెస్ట్ ఐటీ మినిస్టర్‌ను కోల్పోయింది.. ట్విట్టర్ ట్రెండింగ్‌లో కేటీఆర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

