Mukesh Ambani | ముకేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. అంతమొందిస్తామని మెయిల్స్
Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. తాము అడిగినంత ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తాజాగా వచ్చిన మెయిల్లో నిందితుడు పేర్కొన్నాడు. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న అత్యుత్తమ షూటర్లు అంబానీని కాల్చేస్తారని తెలిపాడు.
Mukesh Ambani | ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. తాము అడిగినంత ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తాజాగా వచ్చిన మెయిల్లో నిందితుడు పేర్కొన్నాడు. రూ. 400 కోట్లు ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న అత్యుత్తమ షూటర్లు అంబానీని కాల్చేస్తారని తెలిపాడు. గతంలో మెయిల్ చేసిన షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి నుంచే ఇప్పుడు కూడా బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మెయిల్స్ అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
రూ. 20 కోట్లు ఇవ్వాలని లేనిపక్షంలో అంబానీని చంపేస్తామని అక్టోబర్ 27న తొలి మెయిల్ వచ్చింది. రెండు సందర్భాల్లోనూ ఈ తరహా మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమై, మెయిల్స్ పంపిన వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. తొలుత రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన నిందితుడు.. దాన్ని రూ. 200 కోట్లకు పెంచాడు. అంతటితో ఆగకుండా రూ. 400 కోట్లు డిమాండ్ చేశారు. తాను పంపిన మెయిల్స్‌కు అంబానీ స్పందించకపోవడంతోనే రూ. 400 కోట్లకు పెంచినట్లు తేలింది. గతేడాది సైతం ఇలానే అంబానీని, ఆయన కుటుంబాన్ని మట్టుబెడుతామని గుర్తు తెలియని వ్యక్తులు రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆస్పత్రికి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- E-mails
- Mukesh Ambani
- Mumbai
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

