హైదరాబాద్, ఫిబ్రవరి 23: దుస్తుల, ఆభరణాల విక్రయ సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రచారకర్తగా ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ నియమితులయ్యారు. ఇప్పటికే సినీ నటుడు రామ్ పోతినేని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
వస్త్ర, స్వర్ణాభరణాల రంగంలో 40 ఏండ్లకు పైగా తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న సీఎంఆర్… వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా అద్భుతమైన డిజైన్లను అందిస్తున్న సీఎంఆర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులవడం చాలా సంతోషంగా ఉన్నదని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ప్రపంచ స్థాయి ఫ్యాషన్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త కలెక్షన్లతో అన్నీ ఒకేచోట అందరికీ అందుబాటు ధరలు అందిస్తున్నట్లు సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎండీ మావూరి మోహన్ బాలాజీ తెలిపారు.