Moto g84 5G | సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో మోటో జీ84 5జీ.. 1న లాంచింగ్ !
Moto g84 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ84 5జీ ఫోన్.. సెప్టెంబర్ ఒకటో తేదీన ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.25 వేల లోపే ఉండొచ్చునని భావిస్తున్నారు.
Moto g84 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా వచ్చేనెల ఒకటో తేదీన తన మోటో జీ84 5జీ (Moto g84 5G) ఫోన్ ఆవిష్కరించనున్నది. 14 5జీ బాండ్ల సాయంతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో పని చేస్తుందని తెలిపింది మోటరోలా.
క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తున్న మోటో జీ84 5జీ ఫోన్ ఔటాఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్-14 అప్ డేట్స్, మూడేండ్ల వరకూ సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తామని తెలిపింది మోటరోలా.
మోటో జీ84 5జీ ఫోన్ 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వస్తున్న 50మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ కెమెరాతోపాటు సెల్ఫీలూ, వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
పవర్ బ్యాకప్ కోసం 30వాట్ల టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. 14 5జీ బాండ్స్, 4జీ ఎల్టీఈ, 3జీ, 2జీ, బ్లూ టూత్ 5.1, ఎన్ఎఫ్సీ, వై-ఫై, జీపీఎస్, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. మీడియా వార్తల ప్రకారం మోటో జీ84 5జీ ఫోన్ ధర రూ.22 వేల నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఎన్ని వేరియంట్లు, కలర్ ఆప్షన్లు వెల్లడించాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

