Moto g84 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. దేశీయ మార్కెట్లో తన మోటో జీ84 5జీ ఫోన్ శుక్రవారం ఆవిష్కరించింది. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.19,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు డిస్కౌంట్ పరిమిత ఆఫర్ మాత్రమే. ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మరో రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి సేల్స్ ప్రారంభిస్తారు.
మోటో జీ84 5జీ ఫోన్ 6.55 – అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్) పోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో వస్తున్నది.
6ఎన్ఎం (నానో మీటర్స్) క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తున్న మోటో జీ84 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్14 తోపాటు మూడేండ్ల వరకూ సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తారు.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలూ, వీడియో కాలింగ్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా ఫీచర్ ఉంది.
పవర్ బ్యాకప్ కోసం 30 వాట్ల టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఫోన్‌తోపాటు 30వాట్ల చార్జర్ కూడా ఇస్తారు. వివా మెజెంటా, మార్ష్ మల్లో బ్లూ కలర్ ఆప్షన్లలో ఫోన్ లభిస్తుంది. మోటో జీ84 5జీ ఫోన్ 14 5జీ బాండ్స్, 4జీ ఎల్టీఈ, 3జీ, 2జీ, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సీ, వై-ఫై, జీపీఎస్, చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది.