Moto G14 | మోటరోలా నుంచి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్ మోటో జీ14.. ఇవీ స్పెషిఫికేషన్స్..?!
Moto G14 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కె్ట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ మోటో జీ14 తీసుకొస్తున్నది. ఆగస్టు ఒకటో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తారు.
Moto G14 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కెట్లో తన మోటో జీ14 ఫోన్ వచ్చే మంగళవారం ఆవిష్కరించనున్నది. 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే, యూనిసోక్ టీ 616 ఎస్వోసీ చిప్ సెట్‌తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. గత మార్చిలో ఆవిష్కరించిన మోటో జీ13 ఫోన్‌కు కొనసాగింపుగా మోటో జీ14 ఫోన్ వస్తున్నదని తెలుస్తున్నది. మోటో జీ14 ఫోన్ ధర రూ.10 వేల నుంచి రూ.11 వేల మధ్య ఉండొచ్చు. మోటో జీ13 ఫోన్ రూ.9999లకే లభించింది. ఆగస్టు ఒకటో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారంటూ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ తన వెబ్సైట్లో మైక్రో సైట్ క్రియేట్ చేసింది.
మోటో జీ14 ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14తోపాటు మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది మోటరోలా. 4జీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్నది. మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఇంటర్నల్ స్టోరేజీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు.
మోటో జీ14 ఫోన్ 50-మెగా పిక్సెల్ డ్యూయ్ కెమెరా సెటప్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ ఆఫ్ 20 వాట్ల చార్జింగ్ ఉంటుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 34 గంటల టాక్ టైం, 16 గంటల వీడియో స్ట్రీమింగ్కు బ్యాటరీ సపోర్ట్ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

