Moto G04 | 15న మార్కెట్లోకి మోటో జీ04 ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Moto G04 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ04 ఫోన్‌ను వచ్చే వారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Moto G04 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ04 ఫోన్‌ను వచ్చే వారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మోటో జీ04 ఫోన్ 6.6 అంగుళాల డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. యూనిసోక్ టీ606 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్న ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా అందుబాటులో ఉంటుంది. 10వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.ఈ నెల 15న భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని తెలిపింది.
మోటో జీ04 ఫోన్ నాలుగు రంగులు.. బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయిస్తారు. ఆండ్రాయిడ్ 14 వర్షన్ పై పని చేస్తుంది. రెండు ర్యామ్, రెండు స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ వర్చువల్ ర్యామ్ 16జీబీ ర్యామ్ వరకూ పొడిగించొచ్చు.
మోటో జీ04 ఫోన్ 16-మెగా పిక్సెల్ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తున్నది. ఒకసారి చార్జింగ్ చేస్తే 22 గంటలు టాక్ టైం, 102 గంటలు మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం కలిగి ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ ఎన్ హాన్స్‌డ్ స్పీకర్లు ఉంటాయి. ఇప్పటికే సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న మోటో జీ04 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఫోన్ యూరప్ మార్కెట్లో సుమారు రూ.10,600 (110 యూరోలు) ఉంది. భారత్ మార్కెట్లో ధర ఆవిష్కరణ సందర్భంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

