NPS Pension | నెలకు రూ.10 వేల మదుపు.. రూ.1.5లక్షల పెన్షన్.. ఎలాగంటే?!
NPS Pension | ప్రతి నెలా రూ.10వేలు పెట్టుబడి పెడితే, రిటైర్మెంట్ తర్వాత రూ.1.5 లక్షల పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ ట్రస్ట్ తీసుకొచ్చింది.
NPS Pension | ఆకాశాన్నంటే రీతిలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మీరు ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యాక వచ్చే నిధుల్ని ఈ ధరలు చెద పురుగుల్లా తినేస్తాయి. అలా కాకుండా నెలవారీగా మీ బ్యాంక్ ఖాతాలోకి పెన్షన్ జమ కావడం మీ రిటైర్మెంట్ ఫండ్స్ ఖర్చు చేయడంలో వెసులుబాటుగా ఉంటుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో పని చేస్తున్న నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) సురక్షితం.. ఇది పెన్షన్ కం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ స్కీమ్. సీనియర్ సిటిజన్ల సెక్యూరిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ కం ఇన్వెస్ట్మెంట్ స్కీం.
సుదీర్ఘ కాలంగా ఆకర్షణీయ పొదుపు పథకంగా ఎన్పీఎస్ ఉంటుంది. రెగ్యులేటెడ్ మార్కెట్ బేస్డ్ రిటర్న్స్‌తోపాటు మీ రిటైర్మెంట్ సురక్షితంగా సాగిపోయేలా సమర్థవంతంగా పని చేసే స్కీం ఇది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) స్థాపించిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ (ఎన్పీఎస్టీ) ఆధ్వర్యంలో ఎన్పీఎస్ స్కీమ్ అమలవుతుంది.
ఎన్పీఎస్ స్వచ్ఛంద కంట్రిబ్యూషన్ స్కీమ్. సబ్స్క్రైబర్లు అత్యధిక నిష్పత్తితో కూడిన ప్రీమియం ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం కొనసాగే స్థిర పెట్టుబడుల ఆధారంగా రిటర్న్స్ వస్తాయి. మెచ్యూరిటీ మొత్తంలో 40 శాతం విలువపై యాన్యుటీ బాండ్లు కొనుగోలు చేయొచ్చు. మెచ్యూరిటీ సమయలో గరిష్టంగా 60 శాతం వరకు విత్ డ్రాయల్ చేయొచ్చు. భారీ మొత్తంలో విత్డ్రాతోపాటు నెలవారీగా సౌకర్యవంతమైన పెన్షన్ పొందొచ్చు.
60:40 ఈక్విటీ -డెట్ నిష్పత్తి ప్రకారం వార్షిక ప్రాతిపదికన తేలిగ్గా 10 శాతం వార్షిక రిటర్న్స్ పొందొచ్చు. 60:40 నిష్పత్తి కింద ప్రతి నెలా రూ.10 వేల చొప్పున 30 ఏండ్లు పెట్టుబడి పెట్టారనుకుందాం. దీని ప్రకారం భారీ మొత్తంలో రూ.1,36,75,952 నగదు పొందొచ్చు. నెలవారీగా రూ.45,587 పెన్షన్ అందుకోవచ్చు.
25 ఏండ్ల సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకుంటే రూ.1,36,75,952 మెచ్యూరిటీ సొమ్ము, ప్రతి నెలా అదనంగా రూ.1.03 లక్ష, ఓవరాల్ నెలవారీ పెన్షన్ (ఏడాది మొత్తం) రూ.1.5 లక్షలు పొందొచ్చు. 65 నుంచి 70 ఏండ్ల వరకు ఎన్పీఎస్ స్కీమ్‌లో చేరేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) నిబంధనలు సడలించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

