ఎల్ఐసీ జీవన్ కిరణ్ భళా
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. ఇటీవల జీవన్ కిరణ్ (ప్లాన్ నం.870) పేరుతో ఓ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా ప్లాన్. ఈ పాలసీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) 512ఎన్353వీ01. మెచ్యూరిటీ వరకు రక్షణ,
- ప్రీమియం వాపస్‌తో జీవిత బీమా కవరేజీ
- ఈ ప్లాన్‌లో ప్రీమియం రిటర్న్‌తో లైఫ్ కవరేజీ
- అందుబాటు ధరకే గరిష్ఠ జీవిత బీమా
- 18-65 ఏండ్ల వయసువారు ఈ పాలసీకి అర్హులు
- కనీస బీమా రూ.15 లక్షలు. గరిష్ఠ పరిమితి లేదు
- బీమా రూ.50 లక్షలకుపైగా తీసుకుంటే ట్యాబులర్ ప్రీమియంపై రిబేట్
- 10 ఏండ్ల నుంచి 40 ఏండ్ల వరకు పాలసీ టర్మ్
- పొగ త్రాగేవారు, త్రాగనివారికి వేర్వేరు ప్రీమియం
- సింగిల్ లేదా రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్లు
- సింగిల్ ప్రీమియం పాలసీలకు కనీస మొత్తం రూ.30,000
- రెగ్యులర్ ప్రీమియం పాలసీలకు కనీస ఇన్స్టాల్మెంట్ రూ.3,000
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. ఇటీవల జీవన్ కిరణ్ (ప్లాన్ నం.870) పేరుతో ఓ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇదో నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా ప్లాన్. ఈ పాలసీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) 512ఎన్353వీ01. మెచ్యూరిటీ వరకు రక్షణ, ఆపై చెల్లించిన ప్రీమియంలను తిరిగి పొందే సౌకర్యం దీని ప్రత్యేకత. ఇందులోని రెగ్యులర్ ప్రీమియం ప్లాన్లకు మెచ్యూరిటీ సమయంలో పాలసీదారులు బ్రతికే ఉంటే అప్పటిదాకా చెల్లించిన ప్రీమియం మొత్తాలను సంస్థ తిరిగి చెల్లించనున్నది. ఒకవేళ ప్లాన్ వ్యవధిలో పాలసీదారుడు చనిపోతే వార్షిక ప్రీమియంకు ఏడురెట్లు సమానంగా లేదా అప్పటిదాకా చెల్లించిన ప్రీమియం మొత్తాలపై 105 శాతం అధికంగా ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని కనీస బీమాగా నామినీకి ఎల్ఐసీ అందజేయనున్నది.
అలాగే సింగిల్ ప్రీమియం ప్లాన్లలో నామినీకి కనీస బీమా మొత్తం లేదా ప్రీమియంపై 125 శాతం అదనంగా ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. ఇక ఐదేండ్ల వ్యవధిపై మెచ్యూరిటీ ప్రయోజనం పొందే అవకాశం పాలసీదారులకు ఉంటుంది. అయితే చెల్లింపుల్లో హెచ్చుతగ్గులుంటాయి. అలాగే ఈ అవకాశాన్ని నామినీకి చెల్లించే మరణానంతర ప్రయోజనానికీ ఎంచుకునే సదుపాయం పాలసీదారులకున్నది. సరసమైన ధరలో హైరిస్క్ కవరేజీని అందుకోవచ్చు. ఇందులో భాగంగానే అదనపు ప్రీమియం చెల్లింపుల ద్వారా యాక్సిడెంటల్ డెత్ లేదా డిజబిలిటి బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ వంటివి అందుబాటులో ఉంటాయి. నిర్ణీత వ్యవధిపై మెచ్యూరిటీ/డెత్ బెనిఫిట్ పొందేందుకు సెటిల్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుందని సంస్థ చెప్తున్నది. కాగా, ఆన్లైన్లో www.licindia.in వెబ్‌సైట్‌పై, ఆఫ్‌లైన్‌లో సంస్థకు చెందిన ఏజెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థల నుంచి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. అయితే రెగ్యులర్ టర్మ్ పాలసీలతో పోల్చితే ఈ ప్రీమియం రిటర్న్ ప్లాన్లు ఖరీదెక్కువే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

