Ford India | ఫోర్డ్ ఆస్తులపై ఎంజీ మోటార్స్ ఆసక్తి
Ford India | భారత్‌లో ఫోర్డ్ ఇండియాకు ఉన్న సనంద్, మరాయి మళాయి నగర్ యూనిట్లను ఎంజీ మోటార్స్ కొనుగోలు చేయాలని భావిస్తున్నది.

భారత మార్కెట్ నుంచి నిష్కమించనున్నట్లు ప్రకటించిన అమెరికా ఆటోమొబైల్ కంపెనీ సంస్థ ఫోర్డ్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎంజీ మోటార్స్ ఇండియా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఫోర్డ్ ఇండియా యాజమాన్యతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లోని సనంద్, తమిళనాడులోని మరాయి మళాయి నగర్ యూనిట్లను టేకోవర్ చేయడానికి ఎంజీ మోటార్స్ ఆసక్తిగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రాథమిక దశలోనే చర్చలు
ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఆ రెండు కంపెనీల వర్గాలు తెలిపాయి. దీనిపై స్పందించడానికి ఎంజీ మోటార్స్ ఎండీ రాజీవ్ చాబా నిరాకరించారు. ఇంతకుముందు ఫోర్ట్ ఇండియా యూనిట్లలో ఎంజీ మోటార్స్ ఉత్పాదక కాంట్రాక్ట్ పొందింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ఉత్పత్తి తగ్గుదల, సేల్స్ పడిపోవడంతో దేశంలో విస్తరణ ప్రణాళికలకు ఫోర్డ్ ఇండియా స్వస్తి పలికింది.
తమిళనాడు సర్కార్ ప్రతిపాదన ఇలా
తమ ఉత్పాదక యూనిట్లను పూర్తిగా విక్రయించడానికి సిద్ధం అని ఫోర్డ్ ఇండియా తేల్చేసింది. ఇదిలా ఉంటే, తమిళనాడులోని ఫోర్డ్ ఇండియా యూనిట్‌ను కొనుగోలు చేసేందుకు ఏదైనీ సంస్థ ముందుకు వస్తే, ఆ స్థలాన్ని సదరు సంస్థకు కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి:
SBI Home Loan | గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు తగ్గింపు.. లోన్ ఎంతైనా ఒకే రేటు
Flying Cars : 2024 నాటికి అందుబాటులోకి ఫ్లయింగ్ కార్లు
టెకీలకు బంపర్ బొనాంజా : క్వార్టర్లీ ప్రమోషన్లు, ప్రత్యేక వేతన పెంపు, అదనపు బోనస్‌లు!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ford india
- mg motors
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

