న్యూఢిల్లీ : హెక్టర్ వాహన శ్రేణిలో మరో వేరియంట్ చేరింది. షైన్ వేరియంట్‌ను ఎంజీ మోటార్ ఇండియా లాంఛ్ చేసింది. ఎంజీ హెక్టర్ షైన్ వేరియంట్ ప్రారంభ ధరను రూ 14.52 లక్షలు (ఎక్స్‌షోరూం-ఢిల్లీ)గా నిర్ణయించింది. సూపర్, స్మార్ట్ వేరియంట్ల నడుమ షైన్ వేరియంట్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ యోచిస్తోంది. న్యూ షైన్ వేరియంట్ రాకతో ఎంజీ హెక్టార్ ఇప్పుడు స్టైల్, సూపర్, షైన్, స్మార్ట్ , షార్ప్ వంటి ఐదు వేరియంట్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
ఇక ఎంజీ హెక్టర్ షైన్ గ్రే కలర్లో లభిస్తోంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, 17 ఇంచ్‌ల అలాయ్ వీల్స్, 10.4 ఇంచ్ హెచ్డీ టచ్‌స్క్రీన్ ఏవీఎన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, పుష్ బటన్ స్టార్ట్, స్టాప్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వంటి ఫీచర్లతో షైన్ వేరియంట్ అందుబాటులో ఉంది. మెరుగైన యాక్సెసరీస్‌ను కూడా ఈ వేరియంట్లో ఎంజీ మోటార్ ఇండియా కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది.