MG Comet EV | ఎంజీ కొమెట్ ఈవీ ప్రీ బుకింగ్స్ షురూ.. రూ.11 వేలు చెల్లిస్తే సరి..!
MG Comet EV | ఎంజీ మోటార్ ఇండియా తన కొమెట్ఈవీ కార్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. ఆసక్తి గల వారు రూ.11 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
MG Comet EV | ప్రముఖ బ్రిటన్ కార్ల తయారీ సంస్థ మోరీస్ గ్యారెజెస్ (ఎంజీ) మోటార్ ఇండియా ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ వెహికల్ ‘కొమెట్ ఈవీ (Comet EV) బుకింగ్స్ మొదలయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు ఎంజీ మోటార్ ఇండియా డీలర్ల వద్ద రూ.11 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు. కార్ల డెలివరీ ఈ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. కొమెట్ ఈవీ కారు డెలివరీ ప్రక్రియను తెలుసుకునేందుకు మై ఎంజీ యాప్ (MyMG app) ద్వారా తెలుసుకోవచ్చు.
ఎంజీ కొమెట్ ఈవీ (MG Comet EV) కారు మూడు వేరియంట్లలో లభ్యం అవుతుంది. పేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.7.98 లక్షల నుంచి మొదలవుతుంది. ప్లే, ప్లష్ వేరియంట్ కార్ల ధరలు రూ.9.28 లక్షలు, రూ.9.98 లక్షలు పలుకుతాయి. ఈ ధరలు తొలి 5000 కార్ల బుకింగ్స్ వరకు మాత్రమే పరిమితం. ఈ నెలాఖరులోగా దశల వారీగా కొమెట్ఈవీ కార్లను కస్టమర్లకు డెలివరీ ప్రారంభిస్తామని ఎంజీ మోటార్ ఇండియా తెలిపింది. ఎంజీ కొమెట్ ఈవీ కారుకు ఎంజీ ఈ-షీల్డ్ అందిస్తున్నారు. దీంతో మరమ్మత్తు, సర్వీస్ కాస్ట్ కవరేజీ లభిస్తుంది. 3-3-3-8 ప్యాకేజీ కింద – మూడేండ్లు లేదా లక్ష కి.మీ. వారంటీ, మూడేండ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్, తొలి మూడు షెడ్యూల్డ్ సర్వీసులకు మూడు ఫ్రీ లేబర్ సర్వీస్ అందిస్తున్నది ఎంజీ మోటార్ ఇండియా.
ఎంజీ కొమెట్ ఈవీ (The MG Comet EV) కారు 17.3 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ, ఐపీ67 రేటింగ్, ఎనిమిదేండ్ల వారంటీ లేదా 1.20 లక్షల కి.మీ. వారంటీ అందిస్తున్నది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 230 కి.మీ దూరం ప్రాయణించొచ్చు. 100 శాతం చార్జింగ్ కావాలంటే ఏడు గంటల టైం పడుతుంది. ఈ కారుకు ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ లేదు. వెయ్యికిలోమీటర్ల ప్రయాణానికి రూ.519 మాత్రమే ఖర్చవుతుంది. ఎంజీ కొమెట్ ఈవీ కారు యాజమానులు 80కి పైగా ఎక్స్ టెండెడ్ వారంటీ అండ్ సర్వీస్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీల కవరేజీ రూ.5000 నుంచి మొదలవుతుంది. కస్టమర్లకు బైబ్యాక్ ప్రోగ్రామ్ ఆప్షనల్‌గా అందిస్తున్నది. బైబ్యాక్ ఆఫర్ కింద మూడేండ్ల తర్వాత 60 శాతం ధర చెల్లిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

