న్యూఢిల్లీ : ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా (Meta) తన ఇంజనీర్లకు అత్యధిక వేతనాలను ఆఫర్ చేయడంలో ముందువరసలో నిలుస్తుంది. ఇతర టెక్ దిగ్గజాలతో పోలిస్తే గూగుల్, మెటాలో పనిచేసే ఇంజనీర్లు అధికంగా సంపాదిస్తున్నారని ఈ ఏడాది ఆగస్ట్‌లో వెల్లడైన బ్లైండ్ డేటా వెల్లడించింది. అయితే ఏడాదికి రూ. 3 కోట్ల వేతనం అందుకునే ఉద్యోగి ఏకంగా ఆ జీతాన్ని కాలదన్ని ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
తనకు ఆ ఉద్యోగం సరిపడకపోవడంతోనే భారీ వేతనంతో కూడిన కొలువును పక్కనపెట్టశానని మెటా ఇంజనీర్ తెలిపాడు. మెటాలో పనిచేస్తుండగా తనకు పానిక్ అటాక్స్ రావడంతో పని గంటల తర్వాత కూడా పని నుంచి డిస్కనెక్ట్ కాలేకపోయానని 28 ఏండ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎరిక్ యూ వెల్లడించాడు. తన సంక్లిష్టమైన పని ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని వాపోయాడు.
అయినా పని నుంచి డిస్కనెక్ట్ కాలేకపోయానని, వీకెండ్స్‌లో కూడా పలుమార్లు పనిచేసినా తన పనిని బాస్‌లు విమర్శంచేవారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆఫీస్‌లోనే తనకు పానిక్ అటాక్స్ వచ్చాయని, 2019 నవంబర్‌లో కరోనా మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో తొలిసారిగా పానిక్ అటాక్ వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. ఇక పలుమార్లు పానిక్ అటాక్‌లు వెంటాడటంతో రూ. 3 కోట్ల వేతనంతో కూడిన జాబ్‌ను వదులుకున్నానని ఆపై రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నానని రౌఫ్ పేర్కొన్నాడు.
Read More :