Mercedes-Benz | లగ్జరీ కార్లపై భారతీయుల మోజు.. మెర్సిడెజ్ బెంజ్ ఏం చేస్తున్నదంటే..?!
Mercedes-Benz | లగ్జరీ కార్ల వైపు యువతరం మొగ్గు చూపుతున్నది. గతేడాది లగ్జరీ కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో మూడు ఎలక్ట్రిక్ కార్లతోపాటు ఈ ఏడాది 12 కార్లు ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ లాన్స్ బెన్నెట్ తెలిపారు.
Mercedes-Benz | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ ఇండియా.. మూడు ఎలక్ట్రిక్ కార్లతోపాటు దేశీయ మార్కెట్లో 12 కొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. వాటిలో 50 శాతానికి పైగా టాప్ ఎండ్ వెహికల్ క్యాటగిరీ (ఆయా కార్ల ధరలు రూ.1.5 కోట్లు) లోనే ఉంటాయని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ లాన్స్ బెన్నెట్ తెలిపారు.
గతంతో పోలిస్తే 2023లో లగ్జరీ కార్లకు గిరాకీ పెరిగింది. గతేడాది రికార్డు స్థాయిలో 17,408 కార్లను విక్రయించింది మెర్సిడెజ్ బెంజ్. 2023 కార్ల విక్రయాల్లో మెర్సిడెజ్ 10 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. ఈ నేపథ్యంలో లగ్జరీ కార్ల తయారీపై కేంద్రీకరించామని పేర్కొన్నారు లాన్స్ బెన్నెట్. ఇందుకోసం పుణెలోని తమ ఫ్యాక్టరీ డెవలప్ మెంట్ కోసం రూ.200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. దీంతో భారత్లో మెర్సిడెజ్ బెంజ్ పెట్టుబడులు రూ.3000 కోట్లకు చేరతాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు.
2022లో 15,822 యూనిట్లు, 2023లో 17,408 కార్ల విక్రయంతో మెర్సిడెజ్ బెంజ్ ఇండియా జోరు మీద ఉన్నది. సప్లయ్ అండ్ డిమాండ్లో ఒడిదొడుకులు ఉన్నా, ఈ ఏడాది డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. గతేడాది మొత్తం కార్ల విక్రయాల్లో ఈవీ కార్ల వాటా నాలుగు శాతం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

