Reliance | గతవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో టాప్-10 స్టాక్స్‌లో ఏడు సంస్థలు రూ.1.33 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభ పడింది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 950.51 పాయింట్లు లాభం (1.65 శాతం) ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు టాటా కన్సల్టెనసీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్పోసిస్, స్టేట బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ, ఐటీసీ తదితర సంస్థలు లాభ పడ్డాయి. మరోవైపు, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) రూ.44,956.5 కోట్లు వృద్ధి చెంది రూ.17,53,888.92 కోట్లకు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 22,139.15 కోట్లు లాభ పడి రూ. 8,34,517.67 కోట్ల వద్ద స్థిర పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ. 20,526.61 కోట్లు లబ్ధి పొంది రూ.5,29,898.82 కోట్ల వద్ద నిలిచింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 19,521.04 కోట్లు లాభపడి రూ. 11,76,860.69 కోట్ల వద్ద ముగిసింది.
హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 16,156.04 కోట్లు పెంచుకుని రూ.4,52,396.31 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ. 9,861.07 కోట్లు పెరిగి రూ.4,38,538.73 కోట్ల వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.547.01 కోట్లు వృద్ధి చెంది రూ.6,37,023.14 కోట్లకు పెరిగింది.
మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,518.27 కోట్ల నష్టంతో రూ.6,31,314.49 కోట్లకు పడిపోయింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) ఎం-క్యాప్ రూ.1,186.55 కోట్లు పతనమై రూ. 5,92,132.24 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 222.53 కోట్లు కల్పోయి రూ. 4,54,182.23 కోట్లతో సరిపెట్టుకున్నది. రిలయన్స్ లీడ్‌లో కొనసాగుతుండగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్పోఇస్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ నిలిచాయి.