Maruti Swift S-CNG | మార్కెట్లోకి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ.. ధరెంతంటే?!
Maruti Swift S-CNG |
Maruti Swift S-CNG | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అత్యంత పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు స్విఫ్ట్‌లో జీఎన్జీ వేరియంట్‌ను ఆవిష్కరించింది. దీనికి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ అని పేరు పెట్టింది. వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ అనే వేరియంట్లలో కస్టమర్ల దరికి చేరనున్నది. నూతన స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ కారు ధర రూ.7.77 లక్షల నుంచి మొదలవుతుంది. వీఎక్స్ఐ వేరియంట్ కారు రూ.7.77 లక్షల నుంచి లభిస్తుండగా, జడ్ఎక్స్ఐ వర్షన్ కారు ధర రూ.8.45 లక్షలకు లభిస్తుంది.
అత్యధిక మైలేజీనిచ్చే కార్లలో స్విఫ్ట్ కూడా చేరనున్నది. ఈ ఏడాది వ్యాగన్-ఆర్, సెలెరియో, డిజైర్లను సీఎన్జీ వేరియంట్లలో ఆవిష్కరించింది. సీఎన్జీ సెగ్మెంట్లో అత్యధిక మోడల్ కార్లు గల కంపెనీ మారుతి సుజుకి.
స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ కారు 1.2 లీటర్ల సిరీస్ డ్యుయల్ జెట్, డ్యుయల్ వీవీటీ ఇంజిన్ సామర్థ్యంతో డెవలప్ చేశారు. ఇది 77.49 పీఎస్ ఇంధనం, 98.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా అనుసంధానించారు. కిలో సీఎన్జీ గ్యాస్‌తో 30.90 కి.మీ. మైలేజీ లభిస్తుంది.
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ, ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. అత్యంత స్పోర్టీగా, స్పేసియస్‌గా ఉండే కార్లలో ఇదొకటి. స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ కార్లు 3845 మిమీ పొడవు, 1530 మిమీ ఎత్తు, 1735 ఎంఎం విడ్త్, 2450 ఎంఎం వీల్ బేస్ కలిగి ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

