Maruti Suzuki | ఏఎంటీ వేరియంట్ల కార్ల ధరలు తగ్గించిన మారుతి.. !
Maruti Suzuki | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఏఎంటీ ట్రాన్స్ మిషన్ కార్ల ధరలు తగ్గించింది.
aruti Suzuki | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఏఎంటీ ట్రాన్స్ మిషన్ కార్ల ధరలు తగ్గించింది. ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ కార్లలో ఏఎంటీ మోడల్స్ ధరలు తగ్గిస్తున్నట్లు శనివారం తెలిపింది. ధరలు తగ్గించడానికి కారణానికి వెల్లడించలేదు. దీంతో ఆటో గేర్ షిఫ్ట్ మోడల్ కార్ల ధరలు మరింత అందుబాటు ధరలో లభిస్తాయి. ఏజీఎస్ మోడల్ కార్ల ధరలు రూ.5,000 తగ్గిస్తున్నట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మారుతి సుజుకి వెల్లడించింది. తగ్గించిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా మారుతి సుజుకి సర్వీస్ నెట్ వర్క్ 2500 నగరాల పరిధిలో అందుబాటులో ఉంటది. హర్యానాలోని గుర్ గ్రామ్ లో సర్వీస్ సెంటర్ ప్రారంభంతో మారుతి సుజుకి సర్వీస్ సెంటర్ల సంఖ్య 5000లకు చేరుకున్నది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 400 సర్వీస్ టచ్ పాయింట్లను ప్రారంభించింది. గతేడాది 2.5 కోట్ల కార్లకు సర్వీస్ అందించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

