Maruti Invicto Bookings | ట్రిపుల్ రో సీట్స్ మారుతి ఇన్విక్టో ప్రీ బుకింగ్స్ ప్రారంభం.. రూ.25 వేలు చెల్లిస్తే చాలు
Maruti Invicto Bookings | ట్రిపుల్ రోస్ మారుతి ఎస్యూవీ కం ఎంవీపీ ఇన్విక్టో బుకింగ్స్ సోమవారం ప్రారంభం అయ్యాయి. రూ.25 వేలు చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు.
Maruti Invicto Bookings | మారుతి సుజుకి మూడు వరుసల ఎస్యూవీ కం మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ) కారు ఇన్విక్టో (Invicto) ప్రీ బుకింగ్స్ సోమవారం ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు మారుతి సుజుకి వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా గానీ, సమీప నెక్సా డీలర్‌షిప్‌ల వద్ద గానీ రూ.25 వేలు చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. టయోటా ఇన్నోవా హైక్రాస్ టెక్నాలజీ ఆధారంగా రూపుదిద్దుకున్న ఇన్విక్టో (Invicto) లాంచింగ్‌పై సోషల్ మీడియా వేదికలపై క్యాంపెయిన్ ప్రారంభించింది. జూలై ఐదో తేదీన మారుతి ఇన్విక్టో (Invicto) మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది.
మారుతి సుజుకి ఇన్విక్టో ((Invicto) 2.0-లీటర్ల పెట్రోల్ ఇంజిన్ విత్ స్ట్రాంగ్ హైబ్రీడ్ టెక్నాలజీతో వస్తున్నది. ఈ ఇంజిన్ ఈ-డ్రైవ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 180 హెచ్‌పీ విద్యుత్ వెలువరిస్తుంది. 10.1-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవ్ సీట్ విత్ మెమరీ ఫంక్షన్, సెంట్రల్ కన్సోల్ వద్ద కంట్రోల్ ప్యానెల్, 9-స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ విత్ సబ్‌ఊఫర్ ఫీచర్లు కలిగి ఉంటుంది. మధ్య వరుసలో ఒట్టోమాన్ కెప్టెన్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టైల్గేట్ (టాప్-స్పెక్ వేరియంట్లు) కూడా ఉంటాయి.
మారుతి సుజుకి ఇన్విక్టో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి అడాస్ సిస్టమ్‌తో కూడిన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు ధర రూ.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చునని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

