Maruti Suzuki Invicto | మారుతి నుంచి మరో ఎంపీవీ ఇన్విక్టో.. ధర తెలిస్తే షాక్..?!
Maruti Suzuki Invicto | మారుతి సుజుకి నుంచి మార్కెట్లోకి ముచ్చటగా మూడో ఎంపీవీ ఇన్విక్టో రానున్నది. ఇదే సంస్థ ఫ్లాగ్ షిప్ కారు కానున్నదని తెలుస్తున్నది.
Maruti Suzuki Invicto | ఇప్పటికే భారత్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki India) రెండు మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంవీపీస్) – ఎర్టిగా (Ertiga), ఎక్స్ఎల్6 (XL6) విక్రయిస్తున్నది. ఎంవీపీ సెగ్మెంట్ లీడర్‌గా సుదీర్ఘ కాలంగా ఎర్టిగా (Ertiga) కొనసాగుతున్నది. ఎక్స్ఎల్6 (XL6) కూడా తనకు తాను ప్రీమియం ఆప్షన్ ఎంవీపీగా గుర్తింపు తెచ్చుకున్నది. తాజాగా మార్కెట్లోకి మరో ఎంవీపీ కారు ఇన్విక్టో (Invicto) తేవడానికి ముహూర్తం ఖరారు చేసింది. అంతే కాదు.. మారుతి సుజుకి ఉత్పత్తుల్లోనూ ఇన్విక్టో (Invicto) ఫ్లాగ్షిప్ మోడల్ కారు కానున్నది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross) టెక్నాలజీ ఆధారంగా మారుతి సుజుకి ఇన్విక్టో (Invicto) రూపుదిద్దుకున్నది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం), మారుతి సుజుకి మధ్య టెక్నాలజీ మార్పిడి ఒప్పందం కుదిరిన తర్వాత వస్తున్న నాలుగో మోడల్ కారు ఇన్విక్టో (Invicto). ఇంతకుముందు మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno – టయోటా గ్లాన్జా (Toyota Glanza), మారుతి సుజుకి విటారా బ్రెజా (Maruti Suzuki Vitara Brezza)- టయోటా అర్బన్ క్రూయిజర్(Toyota Urban Cruiser) , మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara)- టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ (Toyota Urban Cruiser Hyryder) కార్లు రెండు సంస్థల మధ్య టెక్నాలజీ మార్పిడితోనే రూపుదిద్దుకున్నవి.

ఈ నెల 19 నుంచి మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. వచ్చేనెల ఐదో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తారు. మార్కెట్లో దీని ధర రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉండొచ్చునని భావిస్తున్నారు.
దాదాపుగా టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు ఇంజిన్‌లోని ఆప్షన్లే మారుతి సుజుకి ఇన్విక్టో లోనూ కొనసాగుతాయని భావిస్తున్నారు. 2.0 లీటర్ల వీవీటీఐ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 174 పీఎస్ విద్యుత్, 205 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంటుంది. 2.0-లీటర్ల వీవీటీఐ పెట్రోల్ ఇంజిన్ విత్ సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 186 పీఎస్ విద్యుత్, 188 ఎన్ఎం ఇంజిన్ టార్చి, 206 ఎన్ఎం మోటార్ టార్చి వెలువరిస్తుంది. ఈ-డ్రైవ్ సీక్వెన్సియల్ షిఫ్ట్ కూడా కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

