Maruti Suzuki | జిమ్నీ.. ఫ్రాంక్స్‌పై యమ క్రేజీ.. మారుతి పెండింగ్ ఆర్డర్లు 4.05 లక్షలు
Maruti Suzuki | మారుతి జిమ్నీ, ఫ్రాంక్స్ వంటి ఎస్యూవీ కార్లకు డిమాండ్ పెరిగింది. సంస్థ పెండింగ్ ఆర్డర్లు 4.05 లక్షలకు చేరాయి.
Maruti Suzuki | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తుండటంతో కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్లకు గిరాకీ ఎక్కువవుతున్నది. తమ సంస్థకు చెందిన వివిధ మోడల్ కార్ల బుకింగ్స్ పెరిగిపోవడంతో పెండింగ్‌లో ఆర్డర్లు 4.05 లక్షలకు పెరిగాయని మారుతి సుజుకి గురువారం వెల్లడించింది. ఎస్ యూవీ క్యాటగిరీని పటిష్ట పరిచేందుకు తీసుకొచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్ మోడల్ కార్ల ఆర్డర్లు కూడా ఇందులో చేర్చింది. ఇటీవలే ఆవిష్కరించిన జిమ్నీ కోసం 11 వేల బుకింగ్స్, ఫ్రాంక్స్ కోసం నాలుగు వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం పూర్తయ్యే నాటికి 3.63 లక్షల వెహికల్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని మారుతి వెల్లడించింది. వీటిలో కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన మోడల్స్ కోసం నమోదైన ఆర్డర్లు 1.19 లక్షలు ఉన్నాయని పేర్కొన్నది.
కొత్తగా కార్ల కొనుగోలు కోసం కస్టమర్ల నుంచి మంచి వ్రుద్ధి కనిపిస్తున్నదని మారుతి తెలిపింది. ‘ఇప్పుడు సుమారు 4.05 లక్షల బుకింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్ మోడల్ కార్లకు ఎక్కువ ఆదరణ ఉంది. రోజుకు జిమ్నీ కోసం వెయ్యి, ఫ్రాంక్స్ కోసం 300 మంది బుకింగ్స్ నమోదు చేసుకుంటున్నారు’ అని మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
అయితే, కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన జిమ్నీ, ఫ్రాంక్స్ మోడల్ కార్ల ధరలు మారుతి సుజుకి వెల్లడించలేదు. పెండింగ్ ఆర్డర్లు పెరగడానికి సెమీ కండక్టర్ల కొరతతో వాహనాల తయారీ తగ్గడమే.
మూడో త్రైమాసికంలో సెమీ కండక్టర్ల కొరత వల్ల సుమారు 46 వేల కార్ల ఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావం పడింది. 2021లో మారుతి సుజుకి 13.64 లక్షల యూనిట్లు విక్రయించింది. 2022 నాటికి 16 శాతం పెరుగుదలతో 15.76 లక్షల యూనిట్లకు పెరిగిందని మారుతి సుజుకి వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

